చలికాలంలో మీ చర్మం,జుట్టు అలా మారకూడదంటే.. ఇలా చేయాల్సిందే! సాధారణంగా చలికాలంలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. వాతావరంలోని మార్పుల కారణంగా చర్మం పొడి బారడం, పగుళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల చర్మం కాంతిహీనంగా మారుతుంది. అందుకని చర్మ సంరక్షణ కోసం చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 30 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 చలికాలంలో చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటింగ్ గా ఉంచాలి. మాయిశ్చరైజర్‌ని, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచడానికి సరైన ఎంపికలు. 2/8 చాలా మంది చలికాలంలో నీళ్లు తాగడం నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ చర్మం పొడి బారకుండా హైడ్రేటింగ్ గా ఉండడానికి నీళ్ళు చాలా అవసరం. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీటిని తాగడం మంచిది. 3/8 చాలా మంది చలికాలంలో నీళ్లు తాగడం నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ చర్మం పొడి బారకుండా హైడ్రేటింగ్ గా ఉండడానికి నీళ్ళు చాలా అవసరం. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీటిని తాగడం మంచిది. 4/8 చలికాలంలో ఆరోగ్యమైన చర్మం కోసం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. మరీ ఎక్కువగా వేడి లేదా చల్ల నీటితో చేయకూడదు. ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం డ్రై నెస్ కి కారణమవుతుంది. 5/8 చలికాలంలో బయటకు వెళ్ళేటప్పుడు చర్మ రక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్ (SPF 30 లేదా ఎక్కువ) అప్లై చేయడం తప్పనిసరిగా పాటించాలి. మీ చర్మానికి అనుగుణంగా SPF ని ఎంచుకోండి. చలి గాలులు కూడా చర్మాన్ని డ్యామేజ్ ప్రమాదం ఉంటుంది. 6/8 అరటిపండు, తేనే ప్యాక్ చలికాలంలో చర్మ సౌందర్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. బనాన ముక్కలుగా చేసి.. అందులో కాస్త తేనే కలిపి మొహానికి అప్లై చేయండి. 15 నిమిషాల తరువాత కడిగేయండి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. 7/8 చల్లని వాతావరణం కారణంగా చర్మం బిగుతుగా మారితే ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల చర్మం సాఫ్ట్ గా తయారవుతుంది. 8/8 చలికాలంలో జుట్టు పొడిగా మారకుండా ఉండడానికి వారానికి ఎండు సార్లు నూనెతో మసాజ్ చేయండి. కొబ్బరి నూనె లేదా బాదం నూనెను ఉపయోగించడం మంచిది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి