Home Cooling Tips: సమ్మర్ టిప్స్.. ఇలా చేస్తే ఇల్లు మొత్తం చల్లగా మారిపోద్ది..!

తులసి, కలబంద, స్నేక్ ప్లాంట్, పుదీనా వంటి మొక్కలు ఇంట్లో పెంచితే గాలి శుద్ధి అయి వేడి తగ్గుతుంది. మట్టి కుండ నీరు, లైట్ కర్టెన్లు కూడా చల్లదనం ఇస్తాయి. రూఫ్‌టాప్ గార్డెనింగ్‌తో కూడా ఇళ్లు ఏసీ లేకుండానే చల్లగా ఉంటుంది. ఈ పద్ధతులు ఖర్చు లేకుండానే ఇంటిని కూల్‌గా ఉంచుతాయి.

New Update
Home Cooling Tips

Home Cooling Tips

Home Cooling Tips: వేసవి ఎండలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఏసీ లేకపోతే ఉండటం కూడా కష్టంగా మారుతోంది. కానీ కొన్ని మొక్కలు పెంచితే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. ఇవి గాలి శుద్ధి చేయడమే కాకుండా వేడిని కూడా తగ్గిస్తాయి.

మొదటిగా తులసి మొక్క ఇంట్లో ఉంటే గాలి ప్యూరిఫై అవుతోంది. దీనిని ఇంట్లో ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. రోజంతా ఆక్సిజన్ అందిస్తూ ఇంట్లో చల్లదనాన్ని ఇస్తుంది. 

అలాగే కలబంద మొక్క కూడా చాలా ఉపయోగకరం. ఇది గాలిలోని విష పదార్థాలను తగ్గించి వేడిని గ్రహిస్తుంది. రాత్రి సమయంలో ఆక్సిజన్ విడుదల చేయడం వల్ల గది చల్లగా ఉంటుంది.

స్నేక్ ప్లాంట్ కూడా ఇంటిలోని వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రాత్రి వేళల్లో మంచి గాలి అందించి నిద్రకు సహాయపడుతుంది.

పుదీనా మొక్కను వంటగది దగ్గర లేదా ఉత్తర దిశలో పెంచితే దాని సువాసన మనసుకు హాయిగా ఉంటుంది. ఇది చిన్న మొక్కే అయినా వేడిని తగ్గిస్తుంది. కొత్తిమీర వంటి చిన్న మొక్కలు కూడా ఇంటికి చల్లదనాన్ని ఇస్తాయి.

ఇంకా ఒక మంచి పద్ధతి ఏమిటంటే ఇంట్లో మట్టి కుండలో నీరు ఉంచడం. అలాగే కిటికీలకు తెల్లటి లేదా లైట్ కలర్ కర్టెన్లు వేయడం వల్ల వేడి తగ్గుతుంది.

ఇక ఒక మంచి ఉదాహరణగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో వేల కుటుంబాలు రూఫ్‌టాప్ గార్డెనింగ్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇళ్ల పైకప్పులపై కూరగాయలు, మొక్కలు, పచ్చదనం పెంచడం వల్ల ఇంటి లోపల వేడి 50% వరకు తగ్గిందని చెబుతున్నారు.

ఈ విధానం వల్ల ఏసీ అవసరం లేకుండానే ఇళ్లు చల్లగా మారుతున్నాయి. కూరగాయలు కూడా లభిస్తున్నాయి, వర్షపు నీరు కూడా నిల్వ అవుతోంది. ఇది తక్కువ ఖర్చుతో అయిపోతుంది కూడా.

మొత్తానికి, ఈ మొక్కలు, చిన్న మార్పులు పాటిస్తే ఏసీ లేకపోయినా ఇంటిని సహజంగా చల్లగా ఉంచుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు