Egg Tawa: స్ట్రీట్ స్టైల్ ఎగ్ తవా మసాలా.. నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు 👌 ఇంట్లో సండే వచ్చిందంటే పిల్లలు ఏదో ఒక స్పెషల్ రెసిపీ కావాలని డిమాండ్ చేయడం సహజం. ఈ సారి సింపుల్ గా నిమిషాల్లో తయారు చేసుకునే ఎగ్ తవా మసాలా ట్రై చేయండి. ఈ రెసిపీ తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 15 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Street Style Egg Tawa Masala : ఇంట్లో సండే వచ్చిందంటే పిల్లలు ఏదో ఒక స్పెషల్ రెసిపీ(Special Recipe) కావాలని డిమాండ్ చేయడం సహజం. కానీ ప్రతీ సండే చికెన్ అంటే మళ్ళీ రొటీన్ అయిపోతుంది. అందుకని సండే రోజు చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఈ నాన్ వెజ్ ఐటమ్(Non-Veg Item) ట్రై చేయండి. ఇది చాలా తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అదే తవా మసాలా గుడ్డు(Egg Tawa Masala). ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము.. తవా మసాలా గుడ్డు కావలసిన పదార్థాలు 4-5 గుడ్లు కొత్తిమీర ఆకులు 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు చిటికెడు పసుపు పొడి ఉప్పు రుచి ప్రకారం 2 అల్లం ముక్కలు పచ్చిమిర్చి 2-3 వెల్లుల్లి రెబ్బలు 2-3 ఒక టీస్పూన్ జీలకర్ర ఒక టీస్పూన్ కాశ్మీరీ ఎర్ర మిర్చి పొడి కొత్తిమీర గరం మసాలా స్ట్రీట్ స్టైల్ ఎగ్ తవా మసాలా రెసిపీ ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి తొక్క తీయండి. ఆ తర్వాత గుడ్లను రెండు భాగాలుగా ఇప్పుడు ఒక బాణీలో నూనె పోసి రెండు భాగాలుగా కట్ చేసిన గుడ్లను వేయాలి. వాటి పై చిటికెడు ఉప్పు, పసుపు, ఎర్ర కారం చల్లండి. అవి రెండు వైపులా బంగారు రంగులోకి మారినప్పుడు, వాటిని ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొత్తిమీర తరుగు, రెండు మూడు పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కను మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ బాణీలో నూనె వేసి, అది వేడెక్కిన తర్వాత, జీలకర్ర గింజలు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ బంగారు రంగులోకి మారినప్పుడు, పైన తయారు చేసుకున్న కొత్తిమీర పేస్ట్ జోడించండి. ఈ మిశ్రమం కాస్త ఉడికిన తర్వాత.. అందులో గరం మసాలా, ధనియాల పొడి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేసి తక్కువ మంటపై వేయించాలి. మసాలా దినుసులు పాన్‌కి అంటుకుంటే కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. చివరిగా ఉడుకుతున్న ఈ మసాలా మిశ్రమంలో ఉడికించిన గుడ్లను వేయండి. అంతే మసాలా ఎగ్ తవా రెడీ. దీన్ని చపాతీ లేదా పరోటాతో సర్వ్ చేయండి. Also Read: Skin Care: మొహం పై ముడతలకు ఈ అలవాట్లే కారణం..! త్వరగా మానుకోండి #sunday-special #egg-recipe #egg-tawa #egg-tawa-masala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి