Black Lips: ఈ సమస్యలు ఉన్నవారిలో.. పెదాలు నల్లగా మారుతాయి..?

సాధారణంగా కొంత మందిలో పెదవులు నల్లగా మారడం గమనిస్తుంటాము. దీనిని హైపర్‌పిగ్మెంటేషన్ అంటారు. పోషకాల లోపం, నాణ్యత లేని కాస్మెటిక్ ఉత్పత్తుల వాడకం, రక్తహీనత, స్మోకింగ్, హార్మోన్ల అసమతుల్యత ఈ సమస్యకు ప్రధాన కారణాలని చెబుతున్నారు నిపుణులు.

New Update
Black Lips: ఈ సమస్యలు ఉన్నవారిలో.. పెదాలు నల్లగా మారుతాయి..?

Black Lips: ముఖ సౌందర్యాన్ని పెంపొందించడంలో పెదాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కానీ కొంత మందిలో పెదవులు నల్లగా మారడం గమనిస్తుంటాము. దీని వల్ల పూర్తి అందం పాడవుతుంది. పెదవులు నల్లబడటాన్ని హైపర్‌పిగ్మెంటేషన్ అంటారు. పెదవులు వాటి సహజ రంగు కంటే ముదురు రంగులోకి మారే పరిస్థితి. ఈ సమస్య ఏ వయసులోనైనా ఎవరికైనా రావచ్చు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము

గులాబీ పెదవులు నల్లగా మారడానికి ప్రధాన కారణాలు

పోషకాల లోపం

నివేదికల ప్రకారం విటమిన్ బి 12, ఐరన్, మెగ్నీషియం లోపం కూడా దీనికి కారణం కావచ్చు. శరీరంలో ఈ పోషకాల లోపం పెదవుల పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అంతే కాదు పెదవుల నలుపుదనం శరీరంలో నీరు లేకపోవడాన్ని సూచిస్తుంది.

కాస్మెటిక్ ఉత్పత్తుల వాడకం

కాలుష్యం, చౌకైన లిప్‌స్టిక్‌ల వాడకం, చెడు కాస్మెటిక్ ఉత్పత్తులు నల్లని పెదవులకు కారణమవుతాయి . అతిగా సిగరెట్ తాగడం, టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం కూడా నల్లని పెదవులకు కారణం.

publive-image

హార్మోన్ల మార్పులు

హార్మోన్ల మార్పులు కూడా పెదవులను మారుస్తాయి. శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవించినప్పుడు మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. గర్భధారణ సమయంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే, గర్భధారణ సమయంలో, మహిళల పెదవులు తరచుగా పొడిగా , నల్లగా మారుతాయి.

రక్తహీనత

రక్తహీనత అనే కూడా పెదాలను పాలిపోయి పొడిగా మార్చుతుంది. ఇది కాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్, మందులు అధికంగా తీసుకోవడం వల్ల పెదవులు నల్లబడే ప్రమాదం పెరుగుతుంది.

Also Read: Life Style : నేల పై కూర్చొని తింటే ఇన్ని లాభాలా..! ఇంకోసారి సోఫా, డైనింగ్ టేబుల్ పై కూర్చోరు

Advertisment
Advertisment
తాజా కథనాలు