Malayalam Actor Mammutti: మమ్ముట్టి ఇంట మరో విషాదం.. ఆయన సోదరి కన్నుమూత!

తల్లి మరణించి ఇంకా ఏడాది కూడా గడవక ముందే ఆయన సోదరి అమీనా (Sister Ameena) మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్నుముశారు.

New Update
Malayalam Actor Mammutti: మమ్ముట్టి ఇంట మరో విషాదం.. ఆయన సోదరి కన్నుమూత!

మలయాళ మెగాస్టార్‌(Malayala Megastar) మమ్మూట్టి (Mammutti) ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించి ఇంకా ఏడాది కూడా గడవక ముందే ఆయన సోదరి అమీనా (Sister Ameena) మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్నుముశారు. కొన్ని నెలల క్రితమే మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్‌ 93 సంవత్సరాల వయసులో మరణించారు.

ఆయన ఇంకా ఆ బాధ నుంచి తేరుకోకముందే..ఆయన సోదరి మరణం ఆయన్ని మరింత విషాదంలోకి నెట్టింది. ఆయన సోదరి గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. చాలా రోజుల నుంచి ఆమె ఆసుపత్రిలోనే ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె మంగళవారం ఉదయం కన్నుమూశారు.

ప్రస్తుతం ఆమె వయసు 70 సంవత్సరాలు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మమ్ముట్టి సోదరి మరణం గురించి తెలుసుకున్న ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తన్నారు. దీంతో మమ్ముట్టి కుటుంబం మరోసారి విషాదంలో మునిగింది. తల్లి మరణించిన కొన్నాళ్లకే సోదరి కూడా మరణించడంతో మమ్ముట్టి తీవ్ర విషాదంలో ఉన్నారు. బుధవారం అమీనా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మమ్ముట్టి ఇటీవలే తన 72 వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రం యొక్క పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేశారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆయన సీతారామంతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mass Jathara Song: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుండి ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ రిలీజ్ చేసారు మేకర్స్. ఇందులో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ పాట ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

New Update
Mass Jathara Song

Mass Jathara Song

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) తన 75వ చిత్రంగా "మాస్ జాతర"తో మరోసారి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీలీల ఈ మూవీలో కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ రీ క్రియేట్..

ఇటీవల రిలీజ్ చేసిన ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ మాస్ ఆడియన్స్ లో ఫుల్ జోష్ నింపింది. ఈ పాటలో ‘ఇడియట్’ సినిమాలోని పాపులర్ బీట్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. అంతేకాదు, అప్పట్లో రవితేజ వేసిన ఐకానిక్ స్టెప్పులను కూడా రీ-క్రియేట్ చేశారు. ఈ మాస్ మూమెంట్స్ అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శ్రీలీలతో కలిసి రవితేజ చేసే డ్యాన్స్ ఈసారి ఎలాంటి మాస్ హంగామా చేస్తుందో చూడాల్సిందే!

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

 

Mass Jathara Song | Hero Ravi Teja | actress-sreeleela | 2025 Tollywood movies | latest tollywood updates | telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-news

Advertisment
Advertisment
Advertisment