వరుణ్‌ను ఆకాశానికెత్తేసిన లావణ్య: పెళ్లి తర్వాత తొలిసారి భర్త గురించి ఏమన్నదో తెలుసా! మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత తొలిసారి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. భర్త వరుణ్ తేజ్ ను పొగడ్తల్లో ముంచెత్తింది. మూడు రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుక జీవితాంతం గుర్తుండిపోతుందని సంతోషంగా చెప్పుకొచ్చింది. By Naren Kumar 18 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Lavanya Tripathi: పెళ్లితో మెగా కోడలైన తర్వాత ఇన్ని రోజులకు ఫ్రీ అయ్యింది లావణ్య త్రిపాఠి. చాలా రోజులకు సోషల్ మీడియాకు వచ్చిన లావణ్య పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ భర్త వరుణ్‌తేజ్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన భర్త చాలా కేరింగ్ అంటూ ఆకాశానికెత్తేసింది. మాటల్లో వ్యక్తపరచలేని చాలా భావాలను తనలోనే దాచుకుంటానంటూ కవిత్వం కూడా రాసేసింది. మూడురోజులు ముచ్చటగా సాగిన పెళ్లి వేడుక జీవితాంతం గుర్తుండిపోయే ఘట్టమని ఎంతో మురిపెంగా చెప్పుకొచ్చింది లావణ్య. ఇది కూడా చదవండి: సల్మాన్, కత్రినా డాన్స్ వీడియో వైరల్..! 'మిస్టర్' మూవీ షూటింగ్ సమయంలో వాళ్లిద్దరిలో ప్రేమ చిగురించింది. నిశ్చితార్థం జరిగే వరకూ ప్రేమ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఆరేళ్ల పాటు సైలెంట్‌గా ప్రేమించుకుని ఈ నవంబరులో ఒక్కటయ్యారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత హైదరాబాద్, డెహ్రాడూన్‌లో రిసెప్షన్‌తో ఈ కొత్త జంట బిజీబిజీగా గడిపారు. పెళ్లి తర్వాత ఇన్‌స్టాలో లావణ్య పెట్టిన తొలి పోస్ట్ ఇదే. #lavanya-tripathi #varun-tej #lavanya-comments-on-varun-tej మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి