Raj Tarun Case : రాజ్‌తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆత్మహత్యయత్నం చేసిన లావణ్య! రాజ్ తరుణ్ ప్రేమ కేసులో లావణ్య తాజాగా తన అడ్వకేట్ తో చేసిన చాటింగ్ సంచలనంగా మారింది. చచ్చిపోతున్నా అంటూ ఓ వైపు లాయర్ కు మెసేజ్ చేసిన లావణ్య..112 కి ఫోన్ చేసి కూడా ఇదే విషయాన్నిచెప్పారు. తన చావుకి కారణం...మాల్వీ, రాజ్ తరుణ్ , వారి కుటుంబ సభ్యులే కారణమని తెలిపారు. By Bhavana 13 Jul 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Big Twist In Raj Tarun v/s Lavanya Case : సినీ నటుడు రాజ్ తరుణ్ (Raj Tarun) ప్రేమ కేసులో నటి లావణ్య (Lavanya) తాజాగా తన అడ్వకేట్ తో చేసిన చాటింగ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. చచ్చిపోతున్నా అంటూ ఓ వైపు లాయర్ కు మెసేజ్ చేసిన లావణ్య..112 కి ఫోన్ చేసి కూడా ఇదే విషయాన్నిచెప్పారు. తన చావుకి కారణం... మాల్వీ, రాజ్ తరుణ్ , వారి కుటుంబ సభ్యులే కారణమని తెలిపారు. నటుడు రాజ్‌తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాను చచ్చిపోతున్నానంటూ లాయర్, పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చిన లావణ్య అందర్ని ఒక్కసారిగా టెన్షన్ పెట్టారు. ముందు లాయర్‌తో కేసు విషయంలో చాటింగ్ చేస్తూ తాను వెళ్లిపోతున్నానంటూ మెసేజ్ చేశారు. రాజ్‌తరుణ్ లేకుండా తాను బతకలేనని మెసేజ్ చేసిన లావణ్య ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నానంటూ సందేశంలో తెలిపారు. ఆ మెసేజ్ చూసిన లాయర్ షాక్ అయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో డయల్ 112 నుంచి కూడా నార్సింగ్ పోలీసులకు సమాచారం వచ్చింది. లావణ్య తన లాయర్ తో చాటింగ్ లో ఏమని పేర్కొన్నారంటే..''ఈ లోకంలో నా పయనం పూర్తి చేసాను. అందుకే ఈ లోకం నుండి వెళ్లిపొతున్నాను. నేను ఏంటో తెలిసిన మనుషులే నన్ను తప్పు బట్టారు.నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు.ఈ లోకం ఒక మాయ, ఈ మాయా ప్రపంచంలో... నేను బతకడం నాకు ఇష్టం లేదు.రాజ్‌తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. మైండ్ గేమ్, గాసిప్స్‌తో విసిగిపోయాను. మస్తాన్ కేసులో నేను కీలు బోమ్మను అయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మాల్విని బతిమలాడాను... కానీ మాల్వి వినిపించుకోలేదు. నా చావుకు కారణం రాజ్‌తరుణ్, అతని తల్లిదండ్రులే. నా చావుకు ప్రధాన కారకురాలు మాల్వీ మలోత్రా. నాకు తినడానికి తిండి లేదని మొత్తుకుంటున్నా... రాజ్‌తరుణ్‌తో మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra) ఎంజాయ్ చేస్తోంది. రాజ్‌తరుణ్, మాల్వీ మోజులో పడి మారిపోయాడు...రాజ్‌తరుణ్ నా మరణాన్ని కోరుకుంటున్నాడు...అంటూ లావణ్య తన అడ్వకేట్ తో చాటింగ్ చేసింది. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి పరుగులు పెట్టారు. సకాలంలో ఆమె వద్దకు చేరుకుని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి రక్షించారు. Also read: రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు! #lavanya #high-drama #actor-raj-tarun సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి