/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
-
Dec 22, 2024 12:44 IST
దొరికిపోయిన అల్లు అర్జున్..జాతర సీన్ వరకు థియేటర్లోనే .. ఇదిగో ప్రూఫ్.. అన్ని అబద్దాలే !
సంధ్యా థియేటర్ ఘటనపై ప్రెస్ మీట్ నిర్వహించిన బన్నీ.. పోలీసులు తొక్కిసలాట గురించి చెప్పగానే మూవీ స్టార్ అయిన కాసేపటికే థియేటర్ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. కానీ, ఆరోజు ఆయన 2 గంటలకు పైగా థియేటర్ లోనే ఉన్నట్లు ప్రస్తుతం నెట్టింట వీడియోలు వైరలవుతున్నాయి.
-
Dec 22, 2024 12:43 IST
అబద్ధాలు చెప్పకు పుష్ప.. ఇదిగో ప్రూఫ్.. కాంగ్రెస్ నేత సంచలన వీడియో
అల్లు అర్జున్ పై కాంగ్రెస్ నేత బల్మూర్ వెంకట్ ధ్వజమెత్తారు. తప్పు చేసిందే కాకుండా మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు చెప్పాడని ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ సినిమా హల్లో ఎంత సేపు ఉన్నాడో, వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో ఫుటేజ్ ఉందన్నారు.
-
Dec 22, 2024 10:41 IST
అల్లు అర్జున్ అతి.. ఇదే తగ్గించుకుంటే మంచిది..' సోషల్ మీడియాలో రేవంత్ ఫ్యాన్స్ హల్చల్
సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. అల్లు అర్జున్ 20minలో థియేటర్ నుంచి వెళ్లిపోయానని చెప్పారు..మరి ఇంటర్వెల్ లో జాతర సీన్ ఎలా చూశారు అని కామెంట్లు పెడుతున్నారు.
-
Dec 22, 2024 10:41 IST
మహిళలకు షాకింగ్.. పెరిగిన బంగారం ధరలు
నేడు మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 పెరిగి రూ.76,115 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
-
Dec 22, 2024 10:40 IST
దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం.. 3గంటల పాటు.. ఛీ.. ఛీ!
ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోశెట్టి అనే యువకుడు మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికను 3 గంటల పాటు ఇంట్లోనే బంధించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి.. ఇంటికి నిప్పటించారు.
-
Dec 22, 2024 10:40 IST
సినిమా లెవెల్‌లో స్కెచ్.. ఆటో డ్రైవర్ హత్య
ఏపీకి చెందిన కారు డ్రైవర్ కుటుంబంతో కలిసి జగద్గిరిగుట్టలో నివసిస్తున్నాడు. ఏడో తరగతి చదవుతున్న తన కూతురిని ఓ ఆటో డ్రైవర్ సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి కిడ్నాప్ చేశాడు. దీంతో ఆ తల్లిదండ్రులు ఆటో డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారు.