/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu
🔴Live News Updates:
Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలుచేపట్టినప్పటి నుంచి అమెరికా వలసదారులపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అక్రమంగా అమెరికాకు వచ్చిన వారిని వెంటాడి, వేటాడి, వేధించైనా అమెరికా నుంచి బయటకు పంపిస్తున్నారు. అక్రమంగా వచ్చిన వారు, టూరిస్టు వీసాలపై వచ్చి దొంగచాటున అక్కడే ఉన్న వారు, చదువుకోవడానికి వచ్చి అక్రమంగా తలదాచుకుంటున్న వారిని పట్టుకుని మరీ బలవంతంగా వారి దేశాలకు పంపిస్తున్నారు.
Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
అమెరికాలో ఎక్కువకాలం నివసించే విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఇదివరకే హెచ్చరికలు జారీ చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ.. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్న్‌మెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. నేరం కింద పరిగణించి జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఎవరికి వారు సొంతంగా అమెరికా విడిచి వెళ్లిపోవాలని అధికారికంగా తెలిపింది.
Also Read: Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!
సొంతంగా అమెరికాను వీడటమే ఉత్తమమైన మార్గమని, ఎటువంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని.. సామాను సర్దుకుని బయల్దేరి విమానం ఎక్కండి అంటూ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఇలాంటి వారిలో విమాన టికెట్ సొమ్మును భరించలేని వారు ఉంటే.. వారికి టికెట్ సొమ్ములో రాయితీ ఇచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.
30 రోజులకు మించి అమెరికాలో ఉన్న వారు రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి వెళ్లగొడతామని తేల్చి చెప్పింది. దాంతో పాటు ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్క రోజు అధికంగా దేశం ఉన్నా.. రోజుకు రూ.86 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని వివరించింది. సొంతంగా దేశం వీడకపోతే గరిష్ఠంగా రూ.4.30 లక్షలు ఫైన్ వేయనున్నట్లు మరోసారి గుర్తు చేసింది.
జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని వివరించింది. జరిమానా కట్టే వారు, జైలు శిక్ష అనుభవించిన వారు భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోతారని వెల్లడించింది.హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజా నిబంధనలు హెచ్1బీ, విద్యార్థి పర్మిట్లపై ఉండే వారికి వర్తించబోవు. అయితే సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీనిని కచ్చితంగా అమలు చేయనున్నారు.
Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం
Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి
-
Apr 14, 2025 21:27 IST
తొలి ఇన్నింగ్స్ పూర్తి.. CSK ముందు టార్గెట్ ఇదే
-
Apr 14, 2025 20:39 IST
వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
-
Apr 14, 2025 20:38 IST
LSG Vs CSK: లక్నో జట్టుకు కళ్లేం వేస్తున్న CSK బౌలర్లు.. 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?
-
Apr 14, 2025 20:38 IST
CSK vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..
-
Apr 14, 2025 20:22 IST
భూ భారతి పోర్టల్ ప్రారంభం..
-
Apr 14, 2025 18:19 IST
అయ్యప్ప భక్తులకు శుభవార్త.. అందరికి బంగారు లాకెట్లు!
-
Apr 14, 2025 18:18 IST
వర్షిణి నువ్వొక ఆడదానివైతే.. అఘోరీ మొదటి భార్య సంచలన సవాల్
అఘోరీ మొదటి భార్య శ్రీవర్షిణికి సవాల్ విసిరింది. ‘‘నేను వర్షిణి అంత గలీజ్ దాన్ని కాదు. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేను కూడా వచ్చి పోరాడుతానని వర్షిణి చెప్పింది. వర్షిణి నిజంగా ఆడపిల్లే అయితే అఘోరీని తీసుకొచ్చి నాకు అప్పగించాలి.’’ అని సవాల్ విసిరింది.
Lady Aghori First Wife Radha Warning To Sri Varshini Photograph: (Lady Aghori First Wife Radha Warning To Sri Varshini) -
Apr 14, 2025 18:18 IST
నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాజీవ్ యువ వికాసం గడువు పెంపు
-
Apr 14, 2025 16:49 IST
చచ్చాడు వెధవ.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు-గంటల వ్యవధిలో ఎన్‌కౌంటర్
కర్ణాటకలోని హుబ్బాలీలో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న 5ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఓ కామాంధుడు రేప్ చేశాడు. ఆపై గొంతునులిమి హతమార్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. ఆ సమయంలో నిందితుడు దాడికి దిగడంతో ఎన్‌కౌంటర్ చేశారు.
-
Apr 14, 2025 09:06 IST
Ukraine: ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ మరో భారీ దాడి.. 34 మంది మృతి
-
Apr 14, 2025 09:03 IST
భక్తులకు TTD అదిరిపోయే శుభవార్త.. ఇక క్యూ లైన్లో ఉండాల్సిన అవసరమే లేదు!
-
Apr 14, 2025 06:52 IST
DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్
-
Apr 14, 2025 06:52 IST
Holiday: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఈ వారంలోనే రెండు సెలవులు!