🔴Live News Updates: బీఆర్ఎస్ నేత దారుణ హత్య

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)

🔴Live News Updates: 

Horoscope:ఈ రాశులవారు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి...!

వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తివ్యాపారాలలో, ఆర్ధిక విషయాలలో ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు..మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..

horoscope
horoscope

 

 మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలతో నిరుత్సాహంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది. కొత్తగా ఏ పనులు ఈ రోజు మొదలు పెట్టవద్దు. కుటుంబంలో ఏర్పడే చిన్న సమస్యల గురించి పట్టించుకోవద్దు. 

Also Read: Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్‌ చీఫ్‌!

వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తివ్యాపారాలలో, ఆర్ధిక విషయాలలో ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు. ప్రయాణాలు ఫలవంతం. తీర్ధయాత్రలలో పాల్గొని ఆధ్యాత్మికంగా గడపడం ప్రశాంతతనిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

Also Read: Trump-Iran:ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్‌ హెచ్చరికలు!

మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలకు ఈ రోజు గొప్పగా ఉంటుంది. మీరు పట్టింది బంగారం అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంది ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది. పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంటుంది. కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండండి. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మంచిది. కొన్ని ఇబ్బందికర సంఘటనల నుంచి బయట పడతారు.


సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, శ్రమ పెరుగుతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. బంధువులతో కలహాలు, మనస్పర్థలు పెరగకుండా జాగ్రత్త పడాలి. 

తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. మీ నైపుణ్యాన్ని చూసి అంతా ప్రశంసిస్తారు. అధికారుల సహాయసహకారాలు అందుకుంటారు. బంధుమిత్రులతో తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు.

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు. మీ విరోధులు ఈ రోజు ఓటమిని అంగీకరిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది. ఆర్ధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. పెండింగు పనులు పూర్తిచేస్తారు.

ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన జాప్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈ రోజు మీ సహనానికి పరీక్షగా ఉంటుంది. ప్రయాణాల్లో చోరభయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విచారంగా, నిరుత్సాహకరంగా ఉంటారు. సామాజిక, ధార్మిక కార్యకలాపాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. సంపద, ప్రతిష్ఠకు నష్టం కలిగే సూచనలున్నాయి. 

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ధర్మబద్ధంగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. 

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతికూలత ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపించకుండా చూసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో వివాదాలకు అవకాశం ఉంది. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోండి. వృత్తి ఉద్యోగాలను నిర్లక్ష్యం చేయవద్దు.

Also Read: Telangana: సన్నబియ్యం పథకం ప్రారంభం.. కొత్తగా 10 లక్షల రేషన్‌కార్డులు జారీ!

Also Read: Diseases Away: రాత్రి భోజనం తర్వాత ఇలా చేస్తే వ్యాధులు దూరం

  • Mar 31, 2025 13:56 IST

    BIG BREAKING: బీఆర్ఎస్ నేత దారుణ హత్య

    సంగారెడ్డి జిల్లాలో రాజకీయ హత్య సంచలనంగా మారింది. కల్హేర్ మండలం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ నేత హరిసింగ్‌ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను నరికి చంపారు. ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు.

    BRS Leader Murder



  • Mar 31, 2025 11:19 IST

    Tirumala : రంజాన్ రోజున తిరుమలలో అన్యమతస్థుడు హల్ చల్ !

    తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. బైక్ పై తిరుమల వెపు దూసుకెళ్లాడు అమీర్ అంజాద్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి.ఈ క్రమంలో పలు వాహనాలను ఢీకొట్టాడు అతన్ని జీఎన్సీ టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

    muslim-tirumala
    muslim-tirumala

     



  • Mar 31, 2025 07:19 IST

    Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్‌ చీఫ్‌!

    ఆఫ్గానిస్తాన్‌ కు పాశ్చాత్య చట్టాలు అవసరం లేదని తాలిబన్‌ చీఫ్‌ హిబాతుల్లా అఖున్‌ జాదా పేర్కొన్నారు.షరియా చట్టం అమలులో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అవసరం లేదన్నారు.

    afghan
    afghan

     



  • Mar 31, 2025 07:19 IST

    Aniket Verma : వర్త్ వర్మా వర్తు.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయి..మామయ్య లోన్లు తీసుకుని ట్రైనింగ్!

    అనికేత్ వర్మ మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లిని కోల్పోయాడు. తల్లి మరణం తరువాత, అతని తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నాడు. దీంతో అతని మేనమామ అనికేత్ బాగోగులు చూసుకున్నాడు. అతనికి 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొదటిసారి క్రికెట్ అకాడమీలో చేర్పించాడు.

    aniket-varma
    aniket-varma

     



  • Mar 31, 2025 07:18 IST

    Exam fee : ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయనివ్వలేదు.. ఎంత బతిమిలాడిన పట్టించుకోకపోవడంతో

    ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ ఫీజు రూ. 800 చెల్లించలేదని పాఠశాల యజమాన్యం పరీక్ష రాయకుండా అడ్డుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య 13 ఏళ్ల బాలిక రియా ప్రజాపతి చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

    exam-fee-up
    exam-fee-up

     



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్..పెద్ద కంపెనీలన్నీ ఢమాల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు అన్ని దేశాల మీద వరుస బాంబ్ లు వేశాయి. దాంతో పాటూ తన సొంత దేశాన్ని కూడా షేక్ చేస్తున్నాయి. టారీఫ్ ల దెబ్బకు వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్ మొదలైంది.

New Update
usa

Blood Bath

ట్రంప్ టారీఫ్ ల మోతకు ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. నిన్న దాదాపు అన్ని దేశాల మీదనా ట్రంప్ కొత్త టారీఫ్ లను విధించారు. దీని దెబ్బకు దాదాపు అన్ని దేశాల్లో షేర్ మార్కెట్ షేక్ అయింది.   ఈరోజు భారత స్టాక్ మార్కెట్ కూడా దడదడలాడింది. ఘోరంగా షేర్లు పతనం అయ్యాయి. బంగారం ధర మరింత పెరిగింది. ఒక్క ఫార్మా తన్ని మిగతా అన్ని రంగాల షేర్లూ అతలాకుతలం అయ్యాయి. మరోవైపు ఆసియా మార్కెట్ల పరిస్థితీ అలానే ఉంది. ఇప్పుడు అమెరికా వాల్ స్ట్రీట్ వంతు.

బ్లడ్ బాత్..

ఈరోజు మొదలవ్వడమే అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని షేర్లూ ఎర్ర రంగు పులుముకున్నాయి. ప్రతీకార సుంకాల మూలంగా వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వినట్లు అవ్వడమే కాకుండా.. అగ్రరాజ్యం ఆర్థిక మాంద్యంలోకి వెళుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఇది అమెరికా మార్కెట్ ను దెబ్బ తీస్తోంది. దీని కారణంగా ప్రధాన సూచీలన్నీ భారీగా పతనం అయ్యాయి. ఉదయం 10 గంటలకు డౌజోన్స్‌ 1500 పాయింట్లకు పైగా నష్టంతో 40,665 వద్ద ట్రేడవుతోంది. నాస్‌డాక్‌ దాదాపు 5 శాతం మేర క్షీణించగా.. ఎస్‌అండ్‌పీ 500 4 శాతం కుంగింది. అమెరికాలో పెద్ద షేర్లు అని చెప్పుకునే నైకీ 12 శాతం, యాపిల్ 9 శాతం తో నష్టాల్లో నడుస్తున్నాయి. ఐఫోన్లకు ప్రధన సప్లయర్ చైనా..ఆ దేశానికి 54 శాతం సుంకాలు విధించడంతో ఐఫోన్ల సప్లయ్ కు ఆటంక ఏర్పడుతుందనే ఆందోళన మొదలైంది. 2020 తర్వాత యాపిల్‌ స్టాక్‌ ఈ స్థాయిలోపతనం కావడం ఇదే తొలిసారి. వీటిో పాటూ టెస్లా, అమెజాన్, మెటా లాంటి మిగతా ప్రధాన షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. 

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | stock-market 

Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు