🔴Live News Updates: ఏందీ సిరాజ్ అన్న.. రూ.12 కోట్లు బొక్క.. 54 పరుగులిచ్చి!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)

🔴Live News Updates: 

APPSC: గ్రూప్- 1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

గ్రూప్‌-1 మెయిన్ పరీక్షకు ఆప్షన్లు మార్చుకోవడానికి మరోసారి ఏపీపీఎస్సీ అవకాశం ఇచ్చింది. పరీక్ష రాసే అభ్యర్థులు మాధ్యమం, పోస్టులు, జోనల్‌ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల వాటిలో మార్పులు చేసుకోవచ్చు. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 2 వరకు చేసుకోవచ్చని తెలిపింది.

APPSC Group 1: గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తులకు గడువు పెంపు

ఏపీలో గ్రూప్‌-1 మెయిన్ పరీక్షకు సంబంధించి ఆప్షన్లు మార్చుకోవడానికి మరోసారి ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. పరీక్ష రాసే అభ్యర్థులు మాధ్యమం, పోస్టులు, జోనల్‌ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల వంటి వాటిలో మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఈ మార్పులు చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది. అభ్యర్థులు ఈ తేదీలోగా వెంటనే మార్చుకోండి. ఇదిలా ఉండగా.. ఇటీవల గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది. 

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల పేపర్లు 

పేపర్-I - ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ఇతివృత్తాలు, అంశాలపై జనరల్ ఎస్సే
పేపర్-II - భారతదేశం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక, భౌగోళిక శాస్త్రం
పేపర్-III - రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం, నీతి
పేపర్-IV - భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
పేపర్-V - సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు

  • Mar 25, 2025 21:42 IST

    విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే యత్నం.. చివరికి

    సౌదీ అరేబియా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. విమానం ల్యాండ్‌ అయ్యాక అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

    Indigo Flight
    Indigo Flight

     



  • Mar 25, 2025 13:47 IST

    CRIME NEWS: పట్టపగలే కానిస్టేబుల్‌పై దాడి.. బీర్ బాటిల్‌తో తలపై కొట్టడంతో!

    హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కానిస్టేబుల్‌ శ్రీకాంత్ పై దాడి జరిగింది. బైక్ రేసర్ ఖాజా బీరు బాటిల్‌తో కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు.

    Attack On Constable, Hyderabad
    Attack On Constable, Hyderabad

     



  • Mar 25, 2025 07:40 IST

    AP SI: పవన్ ఇలాకాలో లంచాల దందా.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన SI

    ఏపీలో ఓ పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్సై  గుణశేఖర్ రూ.20 వేలు  తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దొంతమూరు కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి ఓ కేసు విషయంలో డబ్బు డిమాండ్ చేశాడు.

    si bribe
    si bribe Photograph: (si bribe)

     



Advertisment
Advertisment
Advertisment