/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
-
Dec 19, 2024 17:20 IST
కేటీఆర్ పై ఏసీబీ కేసు.. ఏ క్షణమైనా అరెస్ట్?
ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అర్వింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా ఏసీబీ పేర్కొంది. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
-
Dec 19, 2024 15:40 IST
యూజ్ లెస్ ఫెలో.. నిండు సభలో కోమటిరెడ్డిపై హరీశ్ షాకింగ్ కామెంట్స్!
యూజ్ లెస్ ఫెలో అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు శాసనసభలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
-
Dec 19, 2024 15:15 IST
పార్లమెంటులో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ సస్పెండ్ !
పార్లమెంటు ఆవరణలో జరిగిన తోపులాటపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తోటి ఎంపీలపై దాడి చేసిందుకు స్పీకర్ ఓంబిర్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని సస్పెండ్ చేయాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
-
Dec 19, 2024 14:02 IST
రాహుల్ గాంధీపై మర్డర్ కేసు
పార్లమెంట్‌లో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. రాహుల్ గాంధీ నెట్టేయడం వల్ల అతని తలకు గాయమైందని ప్రతాప్ ఆరోపించారు. ఈక్రమంలో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
Dec 19, 2024 14:02 IST
చంద్రబాబుకు కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఎందుకో తెలుసా?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారు.
-
Dec 19, 2024 11:19 IST
బిగ్ షాక్! టీడీపీ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్
టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ని గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. ఫోన్ నెంబర్స్, ఈ అడ్రెస్సులు మార్చేసి రికవరీ చేసేందుకు కూడా వీల్లేకుండా చేశారని టీడీపీ టెక్నీకల్ టీమ్ తెలిపింది. మంగళవారం రాత్రి ఛానెల్ ని హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
-
Dec 19, 2024 10:52 IST
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి 6 పైర్ ఇంజన్లు!
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్ పరిధి మాదన్నపేట చౌరస్తాలోని ఓ తుక్కు గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజిన్లతో మంటలు అదుపు చేస్తున్నారు.
https://rtvlive.com/telangana/fire-accident-in-the-oldcity-of-hyderabad-telugu-news-8495929