🔴Live News Updates: ఫ్యూచర్‌ సిటీ వరకు మెట్రో విస్తరణ: సీఎం రేవంత్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

Delhi: ప్రత్యేక జడ్జి ఎదుట తహవూర్ రాణా

ముంబయ్ పేలుళ్ళ కేసలో ప్రధాన సూత్రధాని అయిన తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు అర్థరాత్రి ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు.  రాణాకు 14 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరారు. 

delhi
Tahawwur Rana

ఉగ్రవాది తహవూర్ రాణా కూసులో ఈరోజు అర్థరాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. అతనిని ఎన్ఐఏ అధికారులు కొంతసేపటి క్రితం ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. రాణాను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. ఈ క్రమంలో ఎన్‌ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్‌ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకే అర్థరాత్రి జడ్జి ఎదుట ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: సొంత గ్రౌండ్లో ఆర్సీబీ పరమ చెత్త రికార్డు!

మరోవైపు రాణా కేసు విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర ను నియమించింది. అతడిని చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు ఏళ్ల తరబడి కృషి చేస్తున్నామని ఎన్ఐఏ ఇంతకు ముందే చెప్పింది. ఎన్‌ఐతో పాటు ఎన్‌ఎస్‌జీ, భారత విదేశాంగ శాఖ, హోంశాఖ, యూఎస్‌ డీఓజే, అమెరికాలోని సంబంధిత అధికారుల వల్ల ఈ ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యిందని తెలిపింది. 

Also Read:  Live in relationship: పెళ్లి కాకుండా తల్లిదండ్రులైన వారికి హైకోర్టు గుడ్‌న్యూస్

2-3 నెలల్లో ఉరితీయండి..

మరోవైపు ముంబై 26/11 దాడి ప్రధాన నిందితుడు తహవూర్ రాణాపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. రాణా ఇండియాకు చేరుకోగానే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైలులో బిర్యానీ పెట్టి విశ్రాంతి తీసుకోమని మర్యాదలు చేయొద్దని కోరుతున్నారు. ఈ మేరకు రాణా నేడు భారతదేశానికి చేరుకోనుండగా అతన్ని తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బాధితులు, దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. 'రాణా లాంటి ఉగ్రవాదులకు భారతదేశం ఎలాంటి సౌకర్యాలు కల్పించకూడదు. కసబ్‌కు ఇచ్చినట్లుగా బిర్యానీ లేదా విశ్రాంతి ఇవ్వకూడదు. అటువంటి ఉగ్రవాదుల కోసం ప్రత్యేక చట్టం చేయాలి. తద్వారా వారిని 2-3 నెలల్లో ఉరితీయవచ్చు' అని ఆ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలను కాపాడిన మహ్మద్ తౌఫిక్ అలియాస్ 'ఛోటు చాయ్ వాలా' అన్నారు.

  • Apr 11, 2025 20:54 IST

    ఫ్యూచర్‌ సిటీ వరకు మెట్రో విస్తరణ: సీఎం రేవంత్



  • Apr 11, 2025 20:54 IST

    నా పెళ్లి నా ఇష్టం...మీకెందుకంతా ఆసక్తి....రేణుదేశాయ్ అసహనం



  • Apr 11, 2025 20:27 IST

    నెమ్మదిగా సాగుతున్న చెన్నై బ్యాటింగ్.. ధోనీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

    చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్ ఓడిన చెన్నై బ్యాంటింగ్ చేస్తోంది. 10 ఓవర్లలో 60/3 పరుగులు చేసింది. చెన్నై కెప్టెన్‌గా ధోనీ మళ్లీ బాధ్యతలు స్వీకరించగా మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    csk vs kkr
    csk vs kkr Photograph: (csk vs kkr)

     



  • Apr 11, 2025 18:34 IST

    టెట్ నోటిఫికేషన్ విడుదల!

    టీచర్ అభ్యర్థులకు అలర్ట్. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం https://tgtet2024.aptonline.in/tgtet/ అధికారిక వెబ్ సైట్.



  • Apr 11, 2025 16:00 IST

    ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!

    బిహార్‌లో ఓ ప్రేమ వివాహం విచిత్రంగా జరిగింది. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చిన ఎలక్ట్రీషియన్ ఆ ఇంటి యువతిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్త వైరల్ అవుతుండగా ఇంట్రెస్టింగ్ సోర్టీకోసం పూర్తి ఆర్టికల్లోకి వెళ్లండి. 

    fan love
    fan love Photograph: (fan love)

     



  • Apr 11, 2025 15:59 IST

    పపన్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్ డేట్.. ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్!

    పవన్‌ కల్యాణ్‌ అప్ కమింగ్ మూవీ ‘హరి హర వీరమల్లు’ నుంచి బిగ్ అప్ డేట్ వెలువడింది. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేయనున్నట్లు తెలిపారు. మే9న విడుదల కాబోతుందంటూ నిర్మాత దయాకర్ రావు పోస్టర్ రిలీజ్ చేశారు. 

    hari ha rra
    hari ha rra Photograph: (hari ha rra)

     



  • Apr 11, 2025 15:59 IST

    పదినెలల్లో కూటమి పాలన ఎలా ఉందంటే.. .సర్వేలో సంచలన విషయాలు

    ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏపీలో కూట‌మి ఎమ్మెల్యేల‌పై ఒక ప్రముఖ స‌ర్వే సంస్థ ఐఐటీ నిపుణుల‌తో రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వే చేయించింది. స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి.

     Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్



  • Apr 11, 2025 10:10 IST

    Tesla Cybertruck: టెస్లా సర్‌ప్రైజ్: కేవలం $69,990కి కొత్త సైబర్‌ట్రక్ విడుదల!

    టెస్లా USలో కొత్త లాంగ్-రేంజ్ సైబర్‌ట్రక్ వేరియంట్‌ను $69,990 అంటే సుమారు రూ. 58 లక్షలకి విడుదల చేసింది. ఇది టెస్లా సైబర్‌ట్రక్‌లలో తక్కువ ధర కలిగిన మోడల్‌గా, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం తో ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.

    Tesla Cybertruck
    Tesla Cybertruck

     



  • Apr 11, 2025 08:24 IST

    Kangana Ranuat: తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ

    తన ఇంటి కరెంట్ బిల్లు రూ.లక్ష వచ్చిందంటూ మండి ఎంపీ కంగనా రౌనత్ చేసిన గొడవ రాజకీయ చర్చకు కారణమైంది. ఇది బీజేపీ, కాంగ్రెస్ గొడవగా మారింది. దాంతో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అదంతా ఆమె ఇంటి కరెంట్ బిల్లేనంటూ లెక్కలతో సహా చూపించింది.

    Kangana Ranaut



  • Apr 11, 2025 08:24 IST

    Mayawati : మాయావతి మేనకోడలకు వరకట్న,లైంగిక వేధింపులు..!

    బీఎస్పీ అధినేత్రి మాయావతి మేనకోడలు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఫిర్యాదుతో హాపూర్ జిల్లాలో తన భర్త, అత్త, మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్, మామ సహా తొమ్మిది మందిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది.

    Mayawati niece
    Mayawati niece

     



  • Apr 11, 2025 06:44 IST

    RCB Record: సొంత గ్రౌండ్లో ఆర్సీబీ పరమ చెత్త రికార్డు!

    రాయల్ ఛాలెంజర్స్ జట్టు సొంత గ్రౌండ్లో పరమ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒకే వేదికలో అత్యధిక సార్లు (45) ఓడిన జట్టుగా నిలిచింది. భారీ సపోర్ట్ గా ఉండే సొంత గ్రౌండ్లోనే ఇలా ఓటములు ఎదురుకోవడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు.  

    rcb-vs-dc
    rcb-vs-dc

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు