Last Phase Elections 2024: చివరిదశ ఎన్నికలు..ప్రధాని మోదీ సహా పోటీలో ఉన్న ప్రముఖులు వీరే! సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్ ప్రారంభం కానుంది. 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 లోక్‌సభ స్థానాలకు పోటీ జరుగుతుంది. ఈరోజు వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీలో ఉన్నారు. ఈ దశ పోలింగ్ లో పోటీలో ఉన్న ప్రముఖుల వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 01 Jun 2024 in నేషనల్ Uncategorized New Update షేర్ చేయండి Last Phase Elections 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. ఏప్రిల్ 19న మొదటి దశ నుంచి ప్రారంభమైన ఎన్నికలు 57 స్థానాల్లో పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈరోజు (జూన్ 1) ముగుస్తుంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 లోక్‌సభ స్థానాల్లో ఓటర్లు తమ ఎంపీని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును కొద్దిసేపట్లో వినియోగించుకోనున్నారు. ఈ చివరి దశలో పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్‌లలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనితో పాటు ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలోని మిగిలిన 42 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల తొలి ఆరు దశలు పూర్తికావడంతో మొత్తం 543 నియోజకవర్గాలకు గాను 487 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. Last Phase Elections 2024: తమిళనాడు, కేరళ, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మణిపూర్, కర్ణాటక, మిజోరం, హర్యానా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, అండమాన్- నికోబార్ దీవులు దాద్రా- నగర్ హవేలీ, డామన్, డయ్యూ, లడఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరితో సహా వివిధ రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటివరకు ఓటింగ్ పూర్తయింది. ఈరోజు ఏడో దశలో పోలింగ్ ముగిసిన తర్వాత మొత్తం 543 స్థానాల్లో ఓటింగ్ పూర్తవుతుంది. మూడు రోజుల తర్వాత జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. Last Phase Elections 2024: ఏడో దశలో 57 లోక్‌సభ కేంద్రాల్లో మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో ప్రధాని నరేంద్ర మోదీ, రవికిషన్, అనురాగ్ ఠాకూర్, అభిషేక్ బెనర్జీ, అఫ్జల్ అన్సారీ, కంగనా రనౌత్, మనీష్ తివారీ, పవన్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, మిసా భారతి, రవిశంకర్ ప్రసాద్, హర్సిమ్రత్ కౌర్ బాదల్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. ఏడో దశ పోటీలో ఉన్న ప్రముఖులు వీరే.. నరేంద్ర మోదీ (వారణాసి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రధాని మోదీ ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కు మద్దతు ఇచ్చింది. 2014, 2019 సంవత్సరాల్లో ఈ లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీ విజయం సాధించారు. రవి కిషన్ (గోరఖ్‌పూర్): ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ స్థానం నుంచి నటుడు, బీజేపీ నేత రవికిషన్‌ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయనపై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి కాజల్ నిషాద్ పోటీ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రాంభూల్ నిషాద్‌పై రవి కిషన్ విజయం సాధించారు. బీజేపీ మళ్లీ ఈ స్థానం నుంచి ఆయనను అభ్యర్థిగా నిలబెట్టింది. అఫ్జల్ అన్సారీ (ఘాజీపూర్): సమాజ్‌వాదీ పార్టీ ఘాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి అఫ్జల్ అన్సారీని అభ్యర్థిగా చేసింది. 2019లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి మనోజ్ సిన్హాపై విజయం సాధించారు. ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పరస్నాథ్ రాయ్, బీఎస్పీ నుంచి ఉమేష్ కుమార్ సింగ్ పోటీ చేస్తున్నారు. రవిశంకర్ ప్రసాద్ (పాట్నా సాహిబ్): కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ కంచుకోట నుంచి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి అన్షుల్ అభిజీత్ నుంచి ఆయన సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత శత్రుఘ్న సిన్హాను ఓడించారు. పవన్ సింగ్ (కరకట్): భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ అసన్‌సోల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు నిరాకరించడంతో కరకట్ నుంచి ఎన్డీఏ అభ్యర్థి ఉపేంద్ర కుష్వాహపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సీపీఐకి చెందిన రాజా రామ్ సింగ్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. కంగనా రనౌత్ (మండి): బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సీటును బీజేపీ కైవసం చేసుకోవడమే ఆమె లక్ష్యంగా ప్రకటించారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. మనీష్ తివారీ (చండీగఢ్): రెండుసార్లు ఎంపీగా గెలిచిన కిరణ్ ఖేర్ స్థానంలో సంజయ్ టాండన్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆయనపై ఆప్ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ పోటీ చేస్తున్నారు. అనురాగ్ ఠాకూర్ (హమీర్‌పూర్): హమీర్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ సింగ్ రైజాదాపై ఆయన పోటీ చేస్తున్నారు. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో అనురాగ్ ఠాకూర్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. అభిషేక్ బెనర్జీ (డైమండ్ హార్బర్): తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి - సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లోని హై ప్రొఫైల్ లోక్‌సభ స్థానం, డైమండ్ హార్బర్ నుండి పోటీ చేస్తున్నారు. ఆయనపై సీపీఐ(ఎం) నుంచి ప్రతికూర్ రెహమాన్, బీజేపీ నుంచి అభిజిత్ దాస్ పోటీ చేస్తున్నారు. 2014, 2019లో ఈ స్థానం నుంచి అభిషేక్ బెనర్జీ విజయం సాధించారు. మిసా భారతి (పట్లీపుత్ర): బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమార్తె మిసా భారతి పాట్లీపుత్ర లోక్‌సభ స్థానం నుండి RJD అభ్యర్థిగా ఉన్నారు. ఆమెపై బీజేపీ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్‌ను రంగంలోకి దింపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాంకృపాల్ యాదవ్ చేతిలో మిసా భారతి ఓటమి పాలైంది. చరణ్‌జిత్ సింగ్ చన్నీ (జలంధర్): పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. చన్నీ ఆప్‌కి చెందిన పవన్ కుమార్ టిను - శిరోమణి అకాలీదళ్‌కు చెందిన మొహిందర్ సింగ్ కెపిపై పోటీ చేస్తున్నారు. Last Phase Elections 2024: ఈరోజు ఎన్నికలు జరుగుతున్న స్థానాలు ఇవే! ఉత్తరప్రదేశ్: గోరఖ్‌పూర్, ఖుషీనగర్, డియోరియా, బన్స్‌గావ్, ఘోసి, ఘాజీపూర్, వారణాసి, మహరాజ్‌గంజ్, బల్లియా, సేలంపూర్, చందౌలీ, మీర్జాపూర్, రాబర్ట్స్‌గంజ్. పంజాబ్: హోషియార్‌పూర్ (SC), ఆనంద్‌పూర్ సాహిబ్, లూథియానా, ఫతేగర్ సాహిబ్ (SC), గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఖదూర్ సాహిబ్, జలంధర్ (SC), ఫరీద్‌కోట్, ఫిరోజ్‌పూర్, బటిండా, సంగ్రూర్, పాటియాలా. బీహార్: జెహనాబాద్, నలంద, పాట్నా సాహిబ్, అర్రా, బక్సర్, కరకట్, పాట్లీపుత్ర, ససారం. పశ్చిమ బెంగాల్: డైమండ్ హార్బర్, డమ్‌డమ్, జయనగర్, జాదవ్‌పూర్, బరాసత్, బసిర్హత్, కోల్‌కతా సౌత్, కోల్‌కతా నార్త్, మధురాపూర్. చండీగఢ్: చండీగఢ్ లోక్‌సభ స్థానం హిమాచల్ ప్రదేశ్: కాంగ్రా, హమీర్పూర్, మండి, సిమ్లా, ఒడిశా: జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, మయూర్‌భంజ్ జార్ఖండ్: గొడ్డ, దుమ్కా, రాజమహల్ #varanasi #2024-elections #general-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి