KTR: వైరలవుతున్న కేటీఆర్ ''నా అందమైన అర్థాంగికి..'' పోస్ట్! బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తన భార్య శైలిమకు సోషల్ మీడియా వేదికగా ''నా అందమైన అర్థాంగికి పెళ్లి రోజు శుభాకాంక్షలు'' అంటూ 20 వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. By Bhavana 19 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ (KTR) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ (Viral) గా మారింది. కేటీఆర్ ఆయన భార్య శైలిమ (Sailima)ను ఉద్దేశించి ఈ పోస్ట్ ను చేశారు. కేటీఆర్, శైలిమ దంపతులు సోమవారం తమ 20 వ పెళ్లిరోజును జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఓ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆయన తన ఎక్స్ ఖాతాలో '' నా అందమైన అర్థాంగికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. రెండు దశాబ్దాలుగా నా వెన్నంటి ఉండి నాకు అండగా నిలవడమే కాకుండా..నాకు ఇద్దరు అందమైన పిల్లలను ఇచ్చినందుకు , నా జీవితంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు నా ధన్యవాదాలు'' అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు. అంతే కాకుండా '' ఇంకా మరెన్నో సంవత్సరాలు మనం ఇలాగే కలిసుండాలి'' అంటూ ఆయన మనసులో మాటను పంచుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తమ పెళ్లి నాటి ఫోటోను కూడా ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో పాటు తన కుటుంబంతో ఉన్న మరో ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. దీంతో తమ అభిమాన నాయకుడికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. '' మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలంటూ '' అభిమానులు పేర్కొన్నారు. కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు కూడా తమ తల్లిదండ్రుల పెళ్లి రోజును పురస్కరించుకుని తన ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. '' అమ్మనాన్నలకు 20వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు నా తల్లిదండ్రులు కావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. లవ్ యూ వెరీ మచ్ గయ్స్'' అంటూ హిమాన్షు పోస్ట్ చేశారు. నిన్నటి వరకు డైనమిక్ ఐటీ మినిస్టర్ గా కొనసాగిన కేటీఆర్ కాంగ్రెస్ అధికారం చేపట్టాక..ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అదరగొడుతున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ మీద విరుచుకుపడుతున్నారు. సీఎం రేవంత్ కూడా కేటీఆర్ కి తగిన సమాధానమే చెబుతున్నారు. Happy 20th anniversary to my beautiful wife ShailimaThank you for being a huge pillar of support over the last 2 decades and for giving me two beautiful kids and a being a great partner in this journey Here’s to many more years of togetherness pic.twitter.com/8UTpKRXExr— KTR (@KTRBRS) December 18, 2023 Happy 20 years Amma and Dadda ❤️I’m so fortunate to have you both as my parents❤️❤️Thank you for everything and I love you guys very muchhhh❤️ pic.twitter.com/wF6pba9rEc— Himanshu Rao Kalvakuntla (@TheHimanshuRaoK) December 18, 2023 Also read: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. సాయంత్రానికి కీలక ప్రకటన? #ktr #sailima #marrige-day మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి