ఈటలపై సరదాగా సెటైర్ వేసిన కేటీఆర్..సభలో విరబూసిన నవ్వులు! ఓ వైపు ప్రతిపక్షాలకు కౌంటర్ వేస్తునే మంత్రి కేటీఆర్ సభలో నవ్వులు విరబూసేట్టుగా చేశారు. కౌంటర్ ఎటాక్ క్రమంలోనే సరదాగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటల రాజేందర్ పేరును సభలో ప్రస్తావించారు. ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్లిపోగానే అది కాస్త బంద్ అయిందని.. అది ఇప్పుడుందా అన్న.. ఐటీ కంపెనీ అని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా సభ్యులంతా సరదాగా నవ్వారు. By P. Sonika Chandra 04 Aug 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఓ వైపు ప్రతిపక్షాలకు కౌంటర్ వేస్తునే మంత్రి కేటీఆర్ సభలో నవ్వులు విరబూసేట్టుగా చేశారు. కౌంటర్ ఎటాక్ క్రమంలోనే సరదాగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటల రాజేందర్ పేరును సభలో ప్రస్తావించారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరం కలిసి హుజూరాబాద్ లో ఐటీ కంపెనీ ప్రారంభించామని గుర్తు చేశారు. ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్లిపోగానే అది కాస్త బంద్ అయిందని.. అది ఇప్పుడుందా అన్న.. ఐటీ కంపెనీ అని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా సభ్యులంతా సరదాగా నవ్వారు. ఇక అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ ధీటుగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో కులగజ్జి, మత పిచ్చి లేదని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్టేబుల్ గవర్నెన్స్ ఉందన్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన నటుడు రజినీకాంత్ తాను న్యూయార్క్ లో ఉన్నానా.. హైదరాబాద్ లో ఉన్నానో తెలియడం లేదని చెప్పినట్లు సభలో ఆయన గుర్తుచేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కు తెలంగాణ అభివృద్ధి కనిపిస్తోందని కానీ.. ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదని ఆయన మరోసారి మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు కంటి వెలుగులో చూపించుకుంటే మంచిదని విమర్శించారు కేటీఆర్. నేడు బెంగుళూర్ ను వెనక్కి నెట్టి ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ నేతలు ఈ స్కాం.. ఆ స్కాం అని బయట ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నేడు ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తుందన్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన భూమిగా కోకాపేట్ భూములు రికార్డ్ క్రియేట్ చేశాయన్నారు. వేలం పాటలో అక్కడి భూమి ఎకరం 100 కోట్లకు పైగా పలికిందన్నారు. తెలంగాణలో ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయన్నారు. 1987 లోనే ఇంటర్ గ్రాఫ్ పేరుతో ఐటీ ఏర్పడిందన్నారు. మరో వైపు పాతబస్తీలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని..మూసీ నదిపై పాదచారుల కోసం నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి