పీవీకి భారతరత్న ఇవ్వాలి.. కేటీఆర్ డిమాండ్ మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్ నివాళులర్పించారు. By Naren Kumar 24 Dec 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి PV Narasimharao: మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన గొప్ప దార్శనికుడు పీవీ నర్సింహ రావు అని కొనియాడారు. ఇది కూడా చదవండి: సిమ్ కార్డులు కొంటున్నారా.. జాగ్రత్త! ఇతడికి ఏం జరిగిందో చూడండి.. పీవీ నరసింహారావు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన దేశాన్ని ఒడ్డుకు తెచ్చారన్నారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారని, భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ అని అన్నారు. ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని, ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశామని గుర్తుచేశారు. పీవీ సంస్కరణలు ఎప్పటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా.. పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS.. వారితో పలువురు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు నాయకులు ఉన్నారు. pic.twitter.com/90MUo7gy7r — BRS Party (@BRSparty) December 23, 2023 #ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి