Krishna Mukunda Murari Serial: కృష్ణ చిన్నాన్న నిర్దోషి అని మూరారి నిరూపించగలడా? టెన్షన్ తో ముకుందా..! హీరోయిన్ కృష్ణ చిన్నాన్న నిర్దోషి అని నిరూపించేందుకు హీరో మూరారి తెగ ట్రై చేస్తున్నాడు. మరోవైపు ముకుందా ఏమో మూరారితో పెళ్లి జరుగుతుందా? లేదా? మా అన్న దోషి అని తేలుతుందా? అనే టెన్షన్ తో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. By Jyoshna Sappogula 02 Jan 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Krishna Mukunda Murari Today Serial: ఓ ఆర్టిస్ట్ ద్వారా హీరోయిన్ కృష్ణ చిన్నాన్నను నిర్దోషి అని మూరారి నిరూపించాలని అనుకుంటాడు. అయితే, విలన్ దేవ్ తన చెల్లి కోసం నిజం బయటపడకుండా ఆర్టిస్ట్ కు డబ్బు ఆశ చూపించి మాన్యేజ్ చేస్తాడు. దీంతో ఆ ఆర్టిస్ట్ విలన్ దేవ్ బొమ్మ వేయకుండా వేరే వ్యక్తి బొమ్మ వేస్తాడు. నిందితుడి ఇతడు కాదు అని ఆర్టిస్ట్ వేసిన బొమ్మను చూసి చెబుతుంది డాక్టర్. ఎట్టి పరిస్థితిలోనూ నిందితుడిని వదిలి పెట్టొద్దని కృష్ణ అంటుంది. దీంతో విలన్ దేవ్ మరొక ప్లాన్ వేస్తాడు. ఇదిలా ఉండగా మురారి నిద్రపోతుంటే కృష్ణ వచ్చి ముకుంద గొంతుతో పిలుస్తుంది. దీంతో మురారి నిద్రలేచి చిరాకుగా ఏంటి ఇదని అంటాడు. హీరో హీరోయిన్ ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. నేనంటే మీకు ఎంత ఇష్టమని అడుగుతుంది కృష్ణ. రొమాంటిక్ చెప్పండి మామూలుగా కాదని అంటుంది. కృష్ణ జుట్టు పట్టుకుని చూపించి వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలు నీతో బతకాలని ఉందని అంటాడు. దీంతో కృష్ణ పొంగిపోతుంది. Also Read: కావ్యను టార్గెట్ చేసిన కుటుంబ సభ్యులు..అడుగడుగునా అవమానం.! ఇదిలా ఉండగా ఆర్టిస్ట్ ను వెళ్లి నిలదీస్తా ఎందుకు నిందితుడి బొమ్మ కరెక్ట్ గా వేయలేదో అని తన పెద్దమ్మతో అంటాడు. చట్టం దృష్టిలో సొంతవాళ్ళకి పరాయి వాళ్ళకి తేడా ఉండదని నేరం రుజువైతే ఎవరైనా సరే వదిలి పెట్టేదే లేదని అంటాడు. ఇలా తన ఛాలెంజ్ చేస్తూ ఉండగా ఇంతలోనే ముకుందా వాళ్ల అన్న దేవ్ కట్టు గట్టిన గాయాలతో ఇంటికి వస్తాడు. వెంటనే చెల్లి ముకుందా దేవ్ ఏమైంది అని కంగారుగా అడుగుతుంది. శ్రీధర్ ని తీసుకురావడానికి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేసరికి శ్రీధర్ ని చంపేశారని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. నేను వెళ్ళేసరికి నలుగురు అతన్ని కొడుతున్నారని.. నేను అడ్డం వెళ్ళేసరికి నన్ను కూడా కొట్టారని దీంతో స్పృహ తప్పి పడిపోయానని తర్వాత లేచి చూస్తే శ్రీధర్ రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడని దేవ్ చెప్తాడు. ఇక ఆర్టిస్ట్ శ్రీధర్ ని ఎవరు కొట్టి చంపి ఉంటారు అని ఆలోచిస్తుంది కృష్ణ. ముకుందాపై అనుమానం పడుతుంది. అసలు నిజం తెలిసే వరకు ముకుంద మీద ఒక కన్నేసి ఉంచాలని కృష్ణ ఫిక్స్ అవుతుంది. మరొవైపు ముకుందా మురారితో తన పెళ్లి జరుగుతుందా? లేదా అన్న దోషి అని బయడపడుతుందా? అని టెన్షన్ పడుతూ ఉంటుంది. #krishna-mukunda-murari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి