Kotamreddy: జగన్ తోనే పోరాటానికి దిగిన నేను ఇలా చేయడం పెద్ద విషయం కాదు: కోటంరెడ్డి

ఈ గెలుపు తనకు ఒక అపూర్వ విజయం అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎమ్మెల్యే అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలి అనే విధంగా నడుచుకుంటానన్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కక్షసాధింపు చర్యలు, వేధింపులకు గురిచేయవద్దని కార్యకర్తలను హెచ్చరించారు.

New Update
Kotamreddy: జగన్ తోనే పోరాటానికి దిగిన నేను ఇలా చేయడం పెద్ద విషయం కాదు: కోటంరెడ్డి

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గేమ్ ఓవర్.. ప్రజలే విన్నర్స్ అంటూ కామెంట్స్ చేశారు. ఒకే నియోజకవర్గంలో జిల్లాలో ముగ్గురు హ్యాట్రిక్ సాధించారన్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కలికి యనాదిరెడ్డి తర్వాత తనకే అదృష్టం లభించిందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం కొందరు అడ్డదారులు తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అపూర్వ విజయం..

జగన్మోహన్ రెడ్డితోనే పోరాటానికి దిగిన నేను పోటీ చేయడం పెద్ద విషయం కాదన్నారు. తనకు ఇది ఒక అపూర్వ విజయం అని..టీడీపీలో  నేతలు, కార్యకర్తలు తనకు అండగా నిలిచారని అన్నారు. తనతో కలిసి వైసీపీ నుంచి బయటకి వచ్చిన కార్యకర్తలు వెన్నంటే నిలిచారని వ్యాఖ్యానించారు. తనకు నటించడం రాదని.. కుట్రలు, కుతంత్రాలు తెలీవని.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉంటానన్నారు.

Also Read: లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎవరెవరంటే?

అండగా నిలిచారు..

బీజేపీ నేతలు, జనసైనికులు, కమ్యూనిస్టు పార్టీ మిత్రులు తనను గెలిపించుకున్నారన్నారు. వామపక్ష భావజాలాల వ్యక్తులు నిశ్శబ్ద విప్లవం చేశారన్నారు. మాగుంట లే ఔట్ లో ఓ ఐదారు మంది కోటంరెడ్డిని పొడిచేస్తాం అన్నారని..వైసీపీలోని 7 మంది ముఖ్య నేతలు తనకు అండగా నిలిచారని.. వైసీపీలో పనిచేసినా తనకోసం పని చేశారని అన్నారు. ఎన్నికల్లో వ్యతిరేకంగా చేశారని వారిని వేధిస్తే తాను ఒప్పుకోనన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందాలని.. అభివృద్ధి జరగాలని.. ఎమ్మెల్యే అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలి అనే విధంగా నడుచుకుంటానన్నారు.

స్వస్తి పలకండి..

వైసీపీ చేసిన అరాచకాలు అన్ని తనకు తెలుసన్నారు. గంజాయి, డ్రగ్స్, అక్రమ ఇసుక, డ్రగ్స్ సిగిరెస్ట్ వ్యాపారాలు, పేకాట క్లబ్, క్రికెట్ బెట్టింగ్స్, పెట్రోల్, కిరోసిన్ అక్రమ రవాణా, భూదందాలు చేశారని ఆరోపించారు. ఇవ్వన్నీ వదిలేయకుంటే చట్టం తన పని తను కఠినంగా చేస్తుందన్నారు. సోషల్ మీడియాలో ఇష్టప్రకారం పోస్ట్‌లు పెట్టడం లాంటి వాటికి ఇక స్వస్తి పలకండన్నారు. ఈ క్రమంలోనే దళితుల భూములు ఆక్రమించిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు వెంటనే ఖాళీ చేయాలన్నారు. రూరల్ లో కోటంరెడ్డి చెప్పింది జరగాలని..ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు అని విర్రవీగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు