Komatireddy Rajgopal reddy: బండిని చూసి బాత్రూంలో ఏడ్చా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించినప్పుడు బాధ వేసిందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయనను చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. సంజయ్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. By BalaMurali Krishna 21 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి కన్నీళ్లు పెట్టుకున్నా.. బాత్రూంలో ఏడ్చా.. మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించగానే చాలా బాధ కలిగిందని తెలిపారు. మనసులో మాట చెబుతున్నా ఆయనను చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఫుల్ జోష్‌ను తెచ్చింది సంజయ్ అని కొనియాడారు. నా కళ్లలో నీళ్లు వచ్చాయి.. బాత్రూంలో ఏడ్చా అని వ్యాఖ్యానించారు. హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీ గెలవడంలో బండి కీలకపాత్ర పోషించారన్నారు. అందుకే చెబుతున్నా సంజయ్‌ని గుండెల్లో పెట్టుకుని చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ ఏం చేశారో విచారణ ఆగిపోయింది.. ప్రపంచం మొత్తం మోదీ వైపు చూస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబపాలన పోవాలంటే అది బీజేపీకే సాధ్యమన్నారు. బీజేపీ, బీ ర్ఎస్ ఒక్కటేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు ఉంది కదా? ఢిల్లీకి పోయి కేసీఆర్ ఏం చేశారో మరి విచారణ ఆగిపోయిందన్నారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అప్పుడు తండ్రికొడుకులు కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం తప్పదని హెచ్చరించారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. పార్టీలు మారే వ్యక్తిని కాదని మరోసారి స్పష్టంచేశారు రాజగోపాల్ రెడ్డి. కిషన్ రెడ్డి సీఎం అవుతారు.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సునామీ రావడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని.. కిషన్ రెడ్డి సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పోటీ చేయడం కాదు.. దమ్ముంటే కేసీఆర్ హుజురాబాద్‌లో వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీని కొన్ని మీడియా సంస్థలు పైకి లేపుతున్నాయని ఆరోపించారు. శివసేన, ఎన్సీపీ కుటుంబ రాజకీయాలు చేశాయి కాబట్టే విచ్ఛిన్నం అయ్యాయన్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె భర్తపై అరవింద్ అవినీతి ఆరోపణలు చేశారు. అరవింద్ ఆరోపణలపై కవిత సవాల్.. అయితే అరవింద్ ఆరోపణలపై కవిత ఘాటుగా స్పందించారు. ఆయనకు 24గంటలు సమయం ఇస్తున్నా.. తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు 2 కేంద్రీయ విద్యాలయాలను తెచ్చానన్నారు. అరవింద్ ఏం తీసుకువచ్చారని ప్రశ్నించారు. నా భర్తపై ఆరోపణలు చేయడం తగదన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి