Kolkata: సంచలనంగా కోల్‌కతా డాక్టర్ కేసు.. కీలకంగా మారిన సీసీ ఫుటేజ్.. ఆ 29 నిమిషాల్లోనే... కోల్‌కతా డాక్టర్ కేసు పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి 3 వారాలు గడుస్తున్నా కోల్‌కతా పోలీసులు, CBI ఇంకా దోషులెవరో తేల్చలేదు. మరోవైపు తాను రేప్ చేయలేదంటూ నిందితుడు సంజయ్రాయ్ మాట మార్చి కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. By Jyoshna Sappogula 26 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ కేసు దేశంలోనే పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి 3 వారాలు గడుస్తున్నా కోల్‌కతా పోలీసులు, CBI ఇంకా దోషులెవరో తేల్చని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు తాను రేప్ చేయలేదంటూ నిందితుడు సంజయ్రాయ్ మాట మార్చి కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. Also Read: ప్రభుత్వాన్ని మోసం చేసిన మంత్రి పొంగులేటి ! ఆగస్టు 9 తెల్లవారు జాము 4 గంటలకు బైక్‌పై ఆర్జీకర్ కాలేజీకి వచ్చిన సంజయ్ రాయ్.. బైక్ పార్క్ చేసి మూడోఫ్లోర్‌లో డాక్టర్ నిద్రిస్తున్న సెమినార్ హాల్‌కు వెళ్లాడు. 4.03 గంటలకు సెమినార్ హాల్ దగ్గర్లోని కారిడర్లో సంజయ్రాయ్ వెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో కనిపించాయి. తర్వాత తిరిగి 4.32 గంటలకు నిందితుడు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 29 నిమిషాల్లో డాక్టర్‌పై పలుమార్లు అత్యాచారం చేసి..డాక్టర్ గొంతు నొక్కి చంపేసి సంజయ్ రాయ్ పరార్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. Also Read: పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్.. ఇన్‌స్టాలో పోస్ట్..! నిందితుడు సంజయ్‌కి ప్రిన్సిపల్‌తో జూనియర్ డాక్టర్ల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్ ను అదుపులోకి తీసుకున్న CBI ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేపట్టింది. నిందితుడు సంజయ్‌కి ఎవరు సహకరించారనే కోణంలో విచారణ చేపట్టింది. నిందితుడితో పాటు అనుమానితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది. ఇప్పటికే సంజయ్రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా పూర్తయింది. అంతకుముందు, కేసులో తనను ఇరికించారని కోర్టుకు చెప్పిన సంజయ్ రాయ్.. పాలిగ్రాఫ్ టెస్ట్ లో తాను ఎలాంటి నేరం చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. #kolkata-doctor-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి