Kodali Nani: జగన్ కు ఆ ఖర్మ లేదు.. రుషికొండ భవనాలు కట్టింది ఇందుకే.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్

ఎవరిని టార్గెట్ చేసినా భయపడేది లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయరన్నారు. రుషికొండ లోని భవనలు జగన్ నివాశాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ముష్టి ఫర్నిచర్ కోసం ఏంటి రాద్ధాంతం అంటూ మండిపడ్డారు.

New Update
Kodali Nani: జగన్ కు ఆ ఖర్మ లేదు.. రుషికొండ భవనాలు కట్టింది ఇందుకే.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్

Kodali Nani: సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చెయడని జగన్ అన్నారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. సూపర్ సిక్స్ లో హామీలు అమలు చేస్తారా..? ఒకటవ తేది నుండి ఇవన్నీ అమలు చెయ్యాలి.. చేస్తున్నారా..? ప్రతీ మహిళకు 1500 ఎప్పుడు ఇస్తారు..? 20 లక్షల నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తున్నారు..? ఇచ్చిన హామీలు పక్క దారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నాడన్నారు.

Also Read: వైసీపీలో కీలక పరిణామం.. మంత్రిని కలిసిన బుట్టా రేణుక.

నన్ను టార్గెట్ చేస్తే వైసిపి ఆగిపోద్దా.. నన్నే కాదు జగన్ నే టార్గెట్ చేస్తారు. అయితే, ఎవరిని టార్గెట్ చేసినా భయపడేది లేదన్నారు. కనీసం రివ్యూ చెయ్యకుండా వైఎస్ జగన్ కు సెక్యూరిటీ తీసేశారన్నారు. రుషికొండ లోని భవనలు జగన్ నివాశాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: పవన్‌ స్పెషల్ ఫోకస్‌.. ఆ శాఖలో జరిగిన అవకతవకలపై ఆరా..!

ప్రభుత్వ భవనాల్లో, గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన ఖర్మ జగన్ కు లేదని.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సొంత నివాసాల్లోనే ఉంటారని తెలిపారు. రుషికొండ భవనాలు జగన్ ఇల్లు అని ఎవరు చెప్పారు? వైజాగ్ రాజధానికి తీర్చిదిద్దడానికి అంతర్జాతీయ గెస్టుల కోసం అదే స్థాయిలో గెస్ట్ హౌస్ కట్టారు. తాడేపల్లిలో సిఎం క్యాంప్ కార్యాలయం కనుక ఫర్నిచర్ వేశారని.. ముష్టి ఫర్నిచర్ కోసం ఏంటి రాద్ధాంతం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల కడితే డబ్బులు కట్టేస్తామని.. లేకపోతే వచ్చి తీసుకుని పొండని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: అయ్యో బిడ్డలు.. ఈత కోసం వెళ్లి తిరిగి రాని లోకానికి

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలో పడి దేవాన్ష్‌ (6), విజయ్‌ (6), యశ్వంత్‌ (7) లు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

New Update
annamaiah crime news

annamaiah crime news

AP Crime: ఏపీలో విషాదం చోటు చేసుకుంది. సరదాకు ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు పాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. అప్పటి వరకు ఆ ఊరంతా రామ నామస్మరణతో మార్మోగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా.. గ్రామస్థులంతా ఉత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు వెళ్లారు. పండుగ వేళ ఉరంతా సంతోషంగా ఉన్న సమయంలో ఓ విషాదం జరిగింది.  వేడుక అనంతరం ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. విషయం తెలుసుకున్న  కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. కన్న బిడ్డులు మృతి చెందిన విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు. 

ప్రాణం తీసిన ఈత..

ఈ హృదయ విషాదకర సంఘటన శుక్రవారం జరిగింది. చిట్వేలి మండలంలో ఎం. రాచపల్లికి చెందిన చొక్కరాజు నరసింహరాజుకు కుమారుడు దేవాన్ష్‌ (6), శేఖర్‌రాజు కుమారుడు విజయ్‌ (6), వెంకటేష్‌ కుమారుడు యశ్వంత్‌ (7)లు కలిసి గ్రామంలో జరిగిన సీతారాముల ఉభయంలో పాల్గొన్నారు. అనంతరం ఊరి సమీపంలోని నీటి కుంట దగ్గరకు ఈత కొట్టేందుకు వెళ్లారు. నీళ్లలో దిగి ఈత రాక.. ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు. పిల్లల ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆలయం దగ్గర ఉన్నారు అనుకోని ఇంటికి వెళ్లారు. 

ఇది కూడా చదవండి: యువతకు నోటి క్యాన్సర్ ముప్పు..ఈ లక్షణాలను అశ్రద్ధ చేయొద్దు

సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆలయ మైకులో పేర్లు చెప్పించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఊరు బయట ఉన్న నీటి కుంట దగ్గర వెతకగా.. ముగ్గురి మృతదేహం లభ్యమైంది. విజయ్, యశ్వంత్‌ల తల్లితండ్రులు జీవనాధారం కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లారు. చిట్వేలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో వీరిని చదివిస్తున్నారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. పిల్లల మరణానికి కారణమైందని గ్రామ ప్రజలు అంటున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వేసవి విడిది కోసం బెస్ట్‌ ప్లేసులు ఇవే

( ap-crime-news | ap crime latest updates | latest-news )

Advertisment
Advertisment
Advertisment