చంద్రబాబు, పవన్ కు దమ్ము లేదన్న మాజీ మంత్రి రెండు రోజుల క్రితం ఏపీలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ తన రథాన్ని సిద్ధం చేయించుకున్నారు. అన్నవరంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. పవన్ యాత్ర కొనసాగుతుండగా అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. గుడివాడలో టిక్కో ఇళ్ళ పంపిణీ సందర్భంగా పవన్ పై మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. By Editor 1 16 Jun 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి వారాహి యాత్ర ప్రారంభం సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నాని. నవనీత్ కౌర్, సుమలత ఇద్దరూ సినీ హీరోయిన్లు.. ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎంపీలు అయ్యారు.. 16 పార్టీలతో పొత్తులు పెట్టుకుని పవన్ ఏం సాధించాడు? అంటూ సెటైర్లు విసిరారు. చంద్రబాబు కోరిక ప్రతిపక్ష నేతగా ఉండటం, పవన్ కోరిక ఎమ్మెల్యే కావటం.. దీని కోసం ఈ ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్నారని ఎద్దేవ చేశారు. ఈ రెండు పార్టీలను కలుపుకుంటే గానీ పవన్ శాసనసభకు వెళ్లలేని పరిస్థితి ఉందన్న నాని.. జగన్ సీఎం సీటు నుంచి కదిపే దమ్ము చంద్రబాబు, పవన్ కు లేదని విమర్శించారు. తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతా అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు సవాల్ చేశారు కొడాలి. దమ్ముంటే గుడివాడ నుంచి పోటీ చేయాలన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. దివంగత మహానేత వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్ లు గుడివాడకి చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. తన చివరి వరకు సీఎం జగన్ వెంటే ఉంటాననని కొడాలి స్పష్టం చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి