Kitchen Tips: ఆకుకూరలు వండేటప్పుడు.. ఇవి తప్పక పాటించాలి

ఆకుకూరల్లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. రోజూ ఆహారంలో వీటిని తినడం ఎంతో ఆరోగ్యకరం. కానీ ఆకుకూరలు వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. లేదంటే వాటిలోని పోషకాలను కోల్పోతారు. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి .

New Update
Kitchen Tips: ఆకుకూరలు వండేటప్పుడు.. ఇవి తప్పక పాటించాలి

Kitchen Tips: సాధారణంగా కూరగాయలతో పోలిస్తే ఆకుకూరల్లో పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన జీవ శైలి పొందడానికి రోజూ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి. ఆకుకూరల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ , మినరల్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే వీటిని కుక్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వీటిలోని పోషకాలు, రుచిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

ఇది కూడా చదవండి: ఈ సమస్యలను లైట్‌ తీసుకుంటే కిడ్నీలు పోయే ప్రమాదం

ఆయిల్ తో వండాలి

ఆకుకూరలను వండేటప్పుడు కాస్త నూనె, నెయ్యి లేదా బటర్ వేసుకోవాలి. నూనె ఆ డిష్ ను మరింత టేస్టీ గా, పోషకంగా మారుస్తుంది. దీని ద్వారా శరీరంలో పోషకాల శోషణను కూడా మెరుగ్గా ఉంటుంది. శరీరానికి ఫ్యాట్ కూడా చాలా అవసరం అందుకని ప్రతీ వంటకాల్లో కాస్త నూనె వేసుకోవాలి.

తక్కువగా కుక్ చేయాలి

సాధారణంగా ఆకుకూరలు త్వరగా ఉడికిపోతాయి. వీటిని ఎక్కువ సమయం కుక్ చేయడం ద్వారా పోషకాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాటిలోని వాటర్ సోలబుల్ విటమిన్స్ (విటమిన్ C, B విటమిన్స్ ) త్వరగా లీచ్ ఔట్ అయిపోతాయి. దీంతో  ఆకుకూరలు తిన్నా ప్రయోజనమేమి ఉండదు.

publive-image

నీళ్లు తక్కువగా పోయాలి

ఆకుకూరలు ఉడికించేటప్పుడు నీళ్లు తక్కువగా పోయాలి. ఇది వాటిలోని పోషకాలు కోల్పోకుండా కాపాడుతుంది. ఎక్కువగా నీళ్లు వేయడం ద్వారా ఆకుకూరల్లోని వాటర్ సోలబుల్ విటమిన్స్.. త్వరగా లీచ్ ఔట్ అవుతాయి.

రోస్టింగ్

మిగతా కూరగాయల్లా ఆకుకూరలను ఎక్కువ సమయం పాటు రోస్టింగ్ చేయకూడదు. ఇలా చేయడం ద్వారా వాటి కలర్ తో, టెక్షర్ తో పాటు పోషకాలను కూడా కోల్పోతాయి.

సీసనింగ్

ఆకుకూరలు వండే ముందు వాటిని సీసనింగ్ చేసుకోవాలి. సీసనింగ్ చేయడం ద్వారా వాటి పచ్చి వాసన పోవడంతో పాటు ఫ్లేవర్ కూడా రెట్టింపవుతుంది. ఇలా చేస్తే రుచి కూడా బాగా వస్తుంది.

ఇది కూడా చదవండి: రుతుక్రమం విషయంలో మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

Advertisment
Advertisment
తాజా కథనాలు