/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/davdutt-jpg.webp)
కేశినేని(Kesineni) బ్రదర్స్ అనుచరుల మధ్య విభేదాలు మరోసారి తారాస్తాయికి చేరుకున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించింది. సమన్వయ సమావేశం జరుగుతుండగానే చిన్ని(Chinni)గా పేరొందిన కేశినేని శివనాథ్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని-Nani) రాకను ఆయన అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కేశినేని సోదరుల రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువైపుల ప్రజలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడం, ఫర్నీచర్ విసరడం ప్రారంభించి ప్రాంగణాన్ని యుద్ధభూమిగా మార్చారు. వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో ఎస్సై సతీష్ గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే తిరువూరు టీడీపీ అభ్యర్థి దేవదత్‌పై మండిపడ్డారు కేశినేని నాని.. అతను పూజకు పనికి రాని పువ్వు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. నానిపై దేవదత్ రివర్స్ అటాక్‌కు దిగారు?
మీరు ఒక్కరే నియోజవర్గ నాయకుడా?
కేశినేని నాని పై ఫైర్ అయ్యారు దేవదత్. దళితులను చిన్నచూపు చూస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. షట్ అప్ గెటవుట్ అంటూ మాట్లాడడం పై మండిపడ్డారు దేవదత్. మీరు ఒక్కరే నియోజవర్గ నాయకుడా? మేం కాదా? అని ప్రశ్నించారు. నియోజవర్గంలో మీరు ఒక్కరే గెలిచారు.. ఏడుగురిని ఓడించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 17 సంవత్సరాలు వివిధ దేశాల్లో తిరిగి జ్ఞానం సంపాదించుకున్నానని.. నా ఆఫీసులో ఉండి నన్నే అంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరువూరులోనే ఉంటా:
అంతకముందు కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రచ్చకు దారితీశాయి. ఈ నెల 7న చంద్రబాబు 'రా.. కదలి రా..' బహిరంగ సభను విజయవంతం చేసే పూర్తి బాధ్యత తనదేనన్నారు. రేపటి(జనవరి 4)నుంచి సభ పూర్తి అయ్యావరకు తిరువూరులోనే ఉంటానన్నారు. ఏ పదవిలో లేని వ్యక్తులు ఏ విధంగా తిరువూరు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఏ పదవి ఉందని, చిన్ని తిరువూరు వచ్చి ఏర్పాట్లు చేస్తున్నాడో చెప్పాలన్నారు. తిరువూరు టీడీపీ అభ్యర్థి దేవ దత్ కాదని.. అతను పూజకు పనికి రాని పువ్వు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా సభ విజయవంతం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. అనవసరమైన వ్యక్తులు వచ్చింది అలజడలు చేయడానికేనని చిన్ని టార్గెట్‌గా కేశినేని నాని విమర్శలు గుప్పించారు.
Also Read: అభయహస్తం దరఖాస్తులపై కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు!