ఇక నుంచి కేరళ కాదు... ఆ పేరుతో పిలవండి... కీలక తీర్మానానికి కేరళ అసెంబ్లీ ఆమోదం...!

కేరళ అసెంబ్లీ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రం పేరును మార్చేందుకు ఉద్దేశించిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక నుంచి రాష్ట్రం పేరును ‘కేరళ’అని కాకుండా ‘కేరళం’గా పిలవాలని తీర్మానంలో పేర్కొంది. ఈ మేరకు మార్పులు చేయాలని కేంద్రానికి కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని పంపింది. రాజ్యాంగంలోని 3వ నిబంధన కింద పేరు మార్పుకు సంబధించి వెంటనే చర్యలు తీసుకోవాలని తీర్మానంలో కోరింది.

author-image
By G Ramu
New Update

ఈ తీర్మానాన్ని ముఖ్య మంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... తమ రాష్ట్రాన్ని మలయాళంలో కేరళం అంటారని చెప్పారు. 1956 నవంబర్ 1న పలు రాష్ట్రాలను భాషా ప్రాతిపాదికన ఏర్పాటు చేశారని చెప్పారు. కేరళ డేను కూడా నవంబర్ 1న నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.

మలయాళం మాట్లాడే కమ్యూనిటీల కోసం కేరళను ఏకం చేయాల్సిన అవసరం జాతీయ స్వాతంత్య్ర పోరాట కాలం నుండి బలంగా ఉందన్నారు. అయినప్పటికీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ లో తమ పేరు కేరళగా లిఖించబడి వుందన్నారు. అందువల్ల రాష్ట్రం పేరును ఆర్టికల్ 3కింద కేరళ పేరును కేరళంగా మార్చేందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కేంద్రాన్ని అసెంబ్లీ కోరుతోందని చెప్పారు.

అంతే కాకుండా రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ లో పేర్కొన్న అన్ని భాషల్లోనూ తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కోరుతున్నామన్నారు. ఈ తీర్మానానికి ఎలాంటి మార్పులు, సవరణలు, సూచనలు చేయకుండా ప్రతిపక్ష యూడీఎఫ్ కూడా అంగీకారం తెలపింది. అనంతరం ఆ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టుగా స్పీకర్ ఏఎన్ షంషీర్ ప్రకటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు