టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కు చీటింగ్ కేసులో బెయిల్

చీటింగ్ కేసులో అరెస్టు చేయకుండా టీమిండియా మాజీ క్రికెట‌ర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసులో ఇరుపక్షాల మధ్య సెటిల్మెంట్ జరిగిందని జస్టిస్ మహ్మద్ నియాస్ సీపీ తెలిపారు. డిసెంబ‌ర్ 8న కేసులో తుది విచార‌ణ జరగనుంది.

New Update
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కు చీటింగ్ కేసులో బెయిల్

Srishanth: చీటింగ్ కేసులో అరెస్టు చేయకుండా టీమిండియా మాజీ క్రికెట‌ర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసులో ఇరుపక్షాల మధ్య సెటిల్మెంట్ జరిగిందని జస్టిస్ మహ్మద్ నియాస్ సీపీ తెలిపారు. డిసెంబ‌ర్ 8న కేసులో తుది విచార‌ణ జరగనుంది. తన తప్పు లేకపోయినా కేసులో ఇరికించారంటూ శ్రీశాంత్ ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా కేరళ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: రుతురాజ్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు

కేర‌ళ‌ క‌న్నూరు జిల్లాకు చెందిన సారీశ్ గోపాల‌న్ అనే వ్యక్తి టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ పై చీటింగ్‌ కేసు నమోదు చేశాడు. 2019లో ఇద్దరు వ్యక్తులు క‌ర్నాట‌క‌లోని కొల్లూరులో క్రికెట్ అకాడ‌మీ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పి తన నుంచి రూ. 18.70 లక్షలు తీసుకున్నార‌ని, ఆ అకాడ‌మీలో శ్రీశాంత్ భాగస్వామిగా ఉన్నాడని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. అకాడ‌మీలో పార్ట్నర్ షిప్ ఇస్తామని చెప్పడంతోనే తాను ఆ మొత్తాన్ని పెట్టబడి పెట్టానని చెప్పాడు. శ్రీశాంత్ తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు