ED on MLA KTR: కేటీఆర్‌పై కేసు?

మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈడీ అధికారులు. కవితను అరెస్ట్ చేసే విషయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

New Update
ED on MLA KTR: కేటీఆర్‌పై కేసు?

ED Complaints on MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈడీ అధికారులు. కవితను అరెస్ట్ చేసే విషయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చారని.. కవితను అరెస్ట్ చేయకుండా తమని అడ్డుకున్నారని తెలిపారు. దాదాపు 20 మందితో లోపలికి ప్రవేశించి తమపై దౌర్జన్యానికి దిగినట్లు పేర్కొన్నారు.

ఎలా అరెస్ట్ చేస్తారు.. ఈడీ అధికారులపై కేటీఆర్ సీరియస్

ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుప్రీం కోర్టులో కేసు ఉన్నప్పుడు తన చెల్లి (కవిత) ను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ప్రోసిజర్ ప్రకారంగానే అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలపగా.. ట్రానిక్ అరెస్ట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారని ఈడీ అధికారులను కేటీఆర్ నిలదీశారు. తమ వ్యయవాదిని ఎందుకు లోపలి అనుమతించలేదని ఫైర్ అయ్యారు.

KTR Tweet:


Also Read: రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు

Advertisment
Advertisment
తాజా కథనాలు