మరోసారి కావేరి చిచ్చు... తమిళనాడుకు నీళ్లివ్వాలని కర్ణాటకకు సీడబ్ల్యూఆర్‌సీ ఆదేశాలు

కావేరి నదీ జలాల విషయం మరోసారి తమిళనాడు, కర్ణాటక మధ్య చిచ్చురేపింది. రెండు రాష్ట్రాలకు జీవనాధారంగా ఉన్న కావేరీ జలాల పంపిణీపై కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకూ తమిళనాడుకు 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.

New Update
మరోసారి కావేరి చిచ్చు... తమిళనాడుకు నీళ్లివ్వాలని కర్ణాటకకు సీడబ్ల్యూఆర్‌సీ ఆదేశాలు

కావేరి నదీ జలాల విషయం మరోసారి తమిళనాడు, కర్ణాటక మధ్య చిచ్చురేపింది. రెండు రాష్ట్రాలకు జీవనాధారంగా ఉన్న కావేరీ జలాల పంపిణీపై కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకూ తమిళనాడుకు 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరిగా తమ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయాలని, బిలిగుండ్లులో 3000 క్యూసెక్టుల ఫ్లో ఇండేలా చూడాలని, అక్టోబర్ 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అక్టోబర్ 31 వరకూ ఈ ఆదేశాలు అమలు చేయాలని సీడబ్ల్యూఆర్‌సీ స్పష్టం చేసింది.

కర్ణాటకపై తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
దీనికి ముందు, ఇటీవల సమావేశమైన కావేరీ జలాల నిర్వాహక మండలి తమిళనాడు రాష్ట్రానికి సెకనుకు 3 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. అయితే కర్ణాటక ప్రభుత్వం తగినన్ని జలాలు లేవంటూ ఈ ఆదేశాలను విస్మరించింది. మండలి ఆదేశాలను పునఃసమీక్షించాలని కోరింది. కావేరీ జలాల నిర్వాహక మండలి ఆదేశాలు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుండటంతో బుధవారం నాడు జరిగిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రెండు రోజుల క్రితం కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాల మేరకు కావేరీ నీటిని విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం (అక్టోబర్ 9) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు పుదుచ్చేరిల మధ్య వ్యక్తిగత నీటి-భాగస్వామ్య సామర్థ్యాలకు సంబంధించి వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం జూన్ 2, 1990న కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ (CWDT)ని ఏర్పాటు చేసింది.

ప్రభుత్వ వైఫల్యమే : బొమ్మై
తమిళనాడుకు 3,000 క్యూసెక్టుల కావేరీ జలాలను విడుదల చేయాలంటూ బోర్డు ఆదేశాలివ్వడం కర్ణాటక సర్కార్ వైఫల్యమేనని ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై తప్పుపట్టారు. సీడబ్ల్యూఎంఏ ఆదేశాలకు వ్యతిరేకంగా తాము వెళ్తామని చెప్పిన కర్ణాటక సీఎం ఆ పని చేయలేదన్నారు. ఫలితంగానే మరోమారు 3,000 క్యూసెక్కుల నీరు ఇవ్వాలంటూ ఆదేశాలు వచ్చాయని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు