ఈసారి కార్తీక పున్నమి ఎప్పుడూ వచ్చింది..ఆ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి! కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామునే లేచి తలస్నానం చేసి ఉపవాసం ఉండాలి. నదీ ఒడ్డున పిండి దీపాలను వెలిగించడం వల్ల పితృదోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు. By Bhavana 25 Nov 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి పురాణాల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉన్న మాసం కార్తీక మాసం. ఈ మాసంలో శివకేశవులిద్దరినీ భక్తులు పూజిస్తారు. కార్తీక మాసంలోని శుక్లపక్ష పౌర్ణమిని కార్తీక పూర్ణిమ అంటారు. అంతేకాకుండా ఈ పున్నమి రోజున చేసే దానధర్మాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈరోజున దేవతులు స్వర్గం నుంచి భూమికి వచ్చి ఈ పండుగను జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది అధికమాసం రావడంతో కార్తీక పౌర్ణమి రెండు రోజులు వచ్చింది. నవంబర్ 26 మధ్యాహ్నం 2. 30 గంటల నుంచి పౌర్ణమి ఘడియలు రాగా నవంబర్ 27 మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉన్నాయి. ఈ రోజున స్నానం, దానధర్మాలు, ఆచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజున దీపాలను దానం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో నెలరోజులు కూడా దీపాలను వెలిగించే వారు ఉంటారు. వాటిలో కార్తీక సోమవారం, పౌర్ణమి రోజులు చాలా ముఖ్యమైనవి. ఈరోజున నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. ఈరోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం చాలా ముఖ్యం. బ్రహ్మా ముహుర్తంలో నది స్నానం కానీ, సముద్ర స్నానం కానీ ఆచరించాలి.ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని మత విశ్వాసం. ఈరోజున శివుడు త్రిపురాసురుడిని సంహరించాడు. ఆ సంతోషంలో దేవతలుఉ దీపాలు వెలిగించి వేడుకలు జరుపుకున్నారు. దీనినే దేవ్ దీపావళి అంటారు. నదీ స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని పండితులు వివరిస్తున్నారు. కార్తీక పున్నమి నాడు నదీ స్నానం చేయాలి..అలా చేయలేని వారు నీటిలో కొంచెం గంగాజలం వేసి స్నానం చేయాలి. పున్నమి నాడు దీపాలను దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. ఉసిరి కాయ మొక్కకు పూజ చేస్తారు. ఉసిరి చెట్టు కింద భోజనం చేసి సాయంత్రం దీపదానం చేసిన వారి కోరికలు నెరవేరతాయని పండితులు చెబుతున్నారు. శ్రీ మహా విష్ణువుకు నెయ్యి దీపం వెలిగించి, ధూపం, దీపం, పండ్లు పుష్పాలు సమర్పించాలి. సాయంత్రం కూడా విష్ణువుని పూజించి స్వామికి పంచామృతాన్ని సమర్పించాలి. నైవేద్యం పెట్టే సమయంలో తులసి ఆకును పెట్టి దేవుడికి సమర్పించాలి. పిండి దీపాలను తయారు చేసి వాటిని వెలిగించి కోరికలు తీర్చడానికి నదిలో విడిచిపెడతారు. ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుందని నమ్మరం. ఈ రోజున బియ్యం, నువ్వులు, బెల్లం దానం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.దీని వల్ల పితృ దోషం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.. శ్రీ విష్ణువుతో పాటు లక్ష్మిని పూజించండి ఈ రోజున లక్ష్మీ బియ్యం పాయసం నైవేద్యం లేదా తెలుపు రంగు మిఠాయిలు సమర్పించండి. పుష్పించే చెట్టు కింద దీపం వెలిగించండి ఈ రోజున పుష్పించే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి 11 సార్లు ప్రదక్షిణలు చేసి, ఈ రోజున తులసిని పూజించాలి. Also read: అర్జున్ టెండూల్కర్‌కు ముంబై టాటా…? మరో నలుగురు ఆటగాళ్లకు రాంరాం..! #karthika-pournami #pooja-vidhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి