Karthika Masam: కార్తీక మాసం ఎప్పటి నుంచి..పాటించాల్సిన నియమాలు ఏంటి!

కార్తీక మాసం మంగళవారం నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో ఈ మాసం అంతా కూడా నియమ నిష్ఠలతో శివకేశవుల్ని పూజించాలని, మాంసం, మద్యానికి దూరంగా ఉండాలని పండితులు వివరిస్తున్నారు.

New Update
Karthika masam : కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా చేయాలి..పాటించాల్సిన నియమాలు..!!

Karthika Masam 2023: దీపావళి (Diwali) తెల్లవారు జాము నుంచే కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభం అవుతుంది. అయితే ఈసారి అధిక మాసం రావడంతో దీపావళి రెండో రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. శివకేశవులిద్దరిని ఆరాధించే మాసం కార్తీకం. మహిళలు తెల్లవారుజామునే లేచి చన్నీటి స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి..పూజలు నిర్వహిస్తారు.

ఈ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ నెలరోజులు కూడా చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. నిత్యం దేవాలయానికి వెళ్లే వారు కూడా ఉంటారు. శ్రావణ మాసం లో శుక్రవారం ఎంతటి విశిష్టత కలిగి ఉంటుందో ..కార్తీకంలో సోమవారం అంతటి ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. కార్తీకంలో శివకేశవులిద్దరిని సమానంగా పూజిస్తారు.

Also read: సముద్రంలో కుప్పకూలిన హెలికాఫ్టర్‌..ఐదుగురు సైనికులు మృతి

కార్తీక మాసంలో శివునికి మారేడు దళాలతో పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్మకం. ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్‌ 14 నుంచి ప్రారంభం అవుతుంది. మంగళవారం పాడ్యమి తో ప్రారంభం కాగా..బుధవారం భగినీ హస్త భోజనం. శుక్రవారం నాగుల చవితి, 20న కార్తీక మాస మొదటి సోమవారం.

నవంబర్‌ 27 న రెండవ కార్తీక సోమవారం కాగా...కార్తీక పౌర్ణమి. డిసెంబర్‌ 4 న కార్తీక మాసం మూడో సోమవారం. డిసెంబర్ 11 కార్తీక మాసం నాలుగో సోమవారం డిసెంబర్‌ 13 న కార్తీక మాసం ముగుస్తుంది. చలిగాలులు పెరిగే సమయం కాబట్టి ఈ మాసం లో పేదలకు , అనాథలకు స్వెట్టరలు, దుప్పట్లు వంటివి దానం చేస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని పండితులు తెలుపుతున్నారు. దానధర్మాలు గోప్యగా చేసిన వాటికి ఎక్కువ ఫలితాలు ఉంటాయని పండితులు వివరిస్తున్నారు.

ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. దీపారాధనలకు నువ్వుల నూనె మాత్రమే ఉపయోగించాలి. మినుములు తినకూడదు, నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.

కార్తీక పురాణంలో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి. కాబట్టి ఈ ఏడాది నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. డిసెంబరు 13 బుధవారం పోలిస్వర్గంతో కార్తీకమాసం పూర్తవుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు