కేసీఆర్ చెప్పిందే నిజం..వీడియో షేర్ చేసిన కన్నా లక్ష్మీనారాయణ తమిళనాడు-ఏపీ రోడ్ల మధ్య ఉన్న తేడాను చూపిస్తూ ఓ వీడియో షేర్ చేశారు టీడీపీ కన్నా లక్ష్మీనారాయణ. ఆంధ్రకు వెళ్తే సింగిల్ రోడ్డు.. తెలంగాణ వస్తే డబుల్ రోడ్డు అని మన ఆంధ్ర పరువు కేసిఆర్ తీశారని..అయితే, ఆయన చెప్పిందే అక్షరాలా నిజమని చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు. By Jyoshna Sappogula 10 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Kanna Lakshmi Narayana: ఏపీలోని రోడ్లు పై ఎప్పుడు ఎవరో ఒకరు విమర్శలు చేస్తున్నే ఉంటారు. రాష్ట్రంలో రోడ్లు పూర్తి అధ్వానంగా ఉన్నాయంటూ టీడీపీ, జనసేన సహా విపక్షాలు సైతం వైసీపీ సర్కార్ పై దుమ్మెత్తి పొస్తుంటారు. రిసెంట్ గా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రోడ్లపై పంచులు వేశారు. ఆంధ్రాకు వెళ్తే సింగిల్ రోడ్డు.. తెలంగాణ వస్తే డబుల్ రోడ్డు అంటూ కౌంటర్లు వేశారు. తాజాగా, ఏపీ రోడ్లకు సంబంధించి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియోను పోస్టు చేశారు. ఆంధ్రకు వెళ్తే సింగిల్ రోడ్డు.. తెలంగాణ వస్తే డబుల్ రోడ్డు అని మన ఆంధ్ర పరువు తీసిన కేసిఆర్, తను చెప్పినట్టు ... తమిళనాడు .. ఆంధ్రకు మధ్య రోడ్ల తేడా మీరే చూడండి. #IdhemKarmaManaRashtraniki #PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi #APHopeCBN #HOPEamaravati… pic.twitter.com/DkjgSLQMFv — Kanna Lakshmi Narayana (@KLNTDP) November 9, 2023 టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియోను పోస్టు చేస్తూ తమిళనాడు, ఏపీ రోడ్ల మధ్య వ్యత్యాసం ఇదేనని పేర్కొన్నారు. ఆంధ్రాకు వెళ్తే సింగిల్ రోడ్డు.. తెలంగాణ వస్తే డబుల్ రోడ్డని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రా పరువు తీశారని పేర్కొన్నారు. అయితే, ఆయన చెప్పింది అక్షరాలా నిజమని చెబుతూ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో తమిళనాడు నుంచి ఏపీలోకి దారితీసే రోడ్డు నున్నగా ఒక్క గతుకు కూడా లేకుండా ఉండగా.. సరిగ్గా ఏపీలోకి ప్రవేశించాక గుంతలమయంగా మారింది. అడుగుకు పది గుంతలు చొప్పున దర్శనమిచ్చాయి. ఈ వీడియో చూసిన ప్రతిపక్షాలు మరోసారి వైసీపీ ప్రభుత్వం కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. #cm-kcr #andhra-paradesh #kanna-lakshmi-narayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి