Bjp New strategy: తెలంగాణలో కమలం కొత్త స్ట్రాటజీ స్టార్ట్..వారం పాటు ఇక్కడే మకాం వేయనున్న ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మేల్యేలు! ఈసారి ఎన్నికల ప్రచారానికి కమలనాథులు కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.119 నియోజక వర్గాలకు ఒక్కో ఎమ్మెల్యే చొప్పున వారం రోజుల పాటు వారు ఇక్కడే ఉంటారు. ఎమ్మెల్యేలు..ఒక్కో రోజు ఒక్కో మండలంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వారు అసెంబ్లీ స్థాయి కొర్ కమిటీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. వాల్ రైటింగ్ అభియాన్ లో పాల్గొంటారు. స్థానిక నేతలతో ఒక్కొక్కరీ తో వ్యక్తిగతంగా మాట్లాడుతారు.. By P. Sonika Chandra 18 Aug 2023 in రాజకీయాలు New Update షేర్ చేయండి Bjp New strategy: ఎన్నికలకు ఇంకా కేవలం కొన్ని నెలల సమయం మాత్రమే ఉండడంతో అధికార, ప్రతిపక్షాలు స్పీడ్ పెంచుతున్నాయి. తమ కొత్త స్ట్రాటజీలతో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్.. తొలి అభ్యర్థుల లిస్ట్ ను ప్రతిపక్షాల కంటే ముందే విడుదల చేయాలని, దీంతో రేస్ లో ముందజలో ఉన్నామన్న సంకేతాన్ని ఇవ్వాలని చూస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ లు కూడా అభ్యర్థుల జాబితా పై కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి. అధికార పక్షం ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల అమలు పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల కోడ్ సమీపించకముందే.. డబుల్ బెడ్ రూం, బతుకమ్మ చీరలు లాంటి కీలక పథకాలను ప్రజల దగ్గరికి చేర్చాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.కాంగ్రెస్ చేరికలపై ఫోకస్ పెట్టి.. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ఇక బీజేపీ కాస్త వెనక ఉన్న కారణంగా పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి పటిష్టం చేయడానికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. తెలంగాణకు ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు..! ఈసారి ఎన్నికల ప్రచారానికి కమలనాథులు కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు పార్టీలోని కీలక నేతలు మాత్రమే ఎన్నికలున్న రాష్ట్రాల్లో ప్రచారం చేపట్టేవారు. కాని ఈసారి ఎన్నికలున్న రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను ముందుగానే క్షేత్రస్థాయిలో ప్రచారం కోసం పార్టీ అధిష్టానం పంపుతోంది. ఈ క్రమంలో రేపటి నుండి వారం రోజుల పాటు ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మేల్యేలు తెలంగాణలో బస చేయనున్నారు. 119 నియోజక వర్గాలకు ఒక్కో ఎమ్మెల్యే చొప్పున వారం రోజుల పాటు వారు ఇక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో..యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుండి ఎమ్మేల్యేలు తెలంగాణ రాష్ట్రానికి రేపు చేరుకుంటారు. నియోజక వర్గాల్లో ఎమ్మేల్యేలు దృష్టి పెట్టే అంశాలు..! వారం పాటు నియోజక వర్గంలో ఉండే ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు..ఒక్కో రోజు ఒక్కో మండలంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వారు అసెంబ్లీ స్థాయి కొర్ కమిటీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. వాల్ రైటింగ్ అభియాన్ లో పాల్గొంటారు. స్థానిక నేతలతో ఒక్కొక్కరీ తో వ్యక్తిగతంగా మాట్లాడుతారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, స్థానికంగా ప్రభావం చూపెట్టే ప్రముఖులతో ఇంటరాక్షన్ , డిన్నర్ మీటింగ్ లు..సంఘ్ పరివార క్షేత్రాల కార్యకర్తల తో భేటీ..శక్తి కేంద్రాల, బూత్ కమిటీలతో సమావేశం... సంపర్క్ సే సమర్థన్ లో భాగంగా ప్రముఖులను కలవడం..ఎస్సీ,ఎస్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్ళడం...ట్రేడర్ కమ్యూనిటీ, అమరుల కుటుంబాలకు, ప్రొఫెషనల్స్ తో డిన్నర్ సమావేశాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, fpo లు లతో సమావేశాలు..కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలని సందర్శించడం చేయనున్నారు. తరువాత వీటిన్నింటిని క్రోడీకరించి పార్టీ హై కమాండ్ కు ఆయా నియోజక వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వనున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి