Medigadda Project: కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన.. అసాంఘిక శక్తుల ప్రమేయంపై అనుమానం..!

గోదావరి నదిపై మహదేవ్ పూర్ వద్ద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అర్థరాత్రి సమయంలో భారీ శబ్దంతో బి-బ్లాకులోని బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగింది. దాంతో బ్రిడ్జ్ స్వల్పంగా కుంగింది. ఈ ఊహించని పరిణామంతో అలర్ట్ అయ్యారు అధికారులు. డ్యామ్ పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో.. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఈ ఘటన వెనుక అసాంఘిక శక్తులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. సిరోంచ, మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

New Update
Medigadda Project: కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన.. అసాంఘిక శక్తుల ప్రమేయంపై అనుమానం..!

Medigadda Project: జయశంకర్‌ భూపాలపల్లిలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లోని మేడిగడ్డ బ్యారేజీ వంతెన కొంతమేరకు కుంగింది. అర్థరాత్రి సమయంలో భారీ శబ్దంతో బి-బ్లాకులోని బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతో వంతెన కుంగినట్లు గుర్తించారు అధికారులు. ఈ ఘటనతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యామ్ పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. కాగా, ఈ బ్యారేజీ పై నుంచి మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగుతుంటాయి. డ్యామ్ కుంగడంతో వాహనాలను నిలిపివేశారు అధికారులు.

గోదావరి నదిపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది మొదటి ప్రాజెక్టు. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉంటుంది. అయితే, శనివారం రాత్రి సమయంలో ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి నీటిని కిందకు వదిలారు. ఆ సమయంలో డ్యామ్‌పై భారీ శబ్ధం వచ్చింది. పిల్లర్ నెంబర్ 20 వద్ద బ్రిడ్జి కుంగింది. వెంటనే అలర్ట్ అయిన ప్రాజెక్టు ఇంజనీర్ తిరుపతిరావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుంగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అధికారులు పరిస్థితిని పరీశీలిస్తున్న సమయంలోనూ శబ్ధాలు రావడంతో.. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు.

నీటి విడుదల..

ఘటన జరిగిన సమయంలో ప్రాజెక్టులో 10.17 టీఎంసీల నీరు ఉంది. అయితే, అర్థరాత్రి వేళ డ్యామ్ కుంగడంతో.. ఇంజనీర్లు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా. డ్యామ్‌ను ఖాళీ చేస్తున్నారు. మొత్తం 46 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మేడిగడ్డ ప్రాజెక్టుకు చేరుకున్న ఎల్ అండ్ టీ అధికారులు..

మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన విషయం తెలుసుకున్న ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిథులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. పరిస్థితిని సమీక్షించారు. చీకటిగా ఉండటంతో ఏమీ తెలియడం లేదని, ఉదయాన్నే పరిశీలిస్తామని చెప్పారు అధికారులు.

పోలీసులకు ఫిర్యాదు..

భారీ శబ్ధంతో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై ఇంజనీర్లు మహారాష్ట్ర వైపు సిరోంచ, తెలంగాణలో మహదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రాజెక్టు అధికారులు. గతేడాది 29 లక్షల క్యూసెక్కుల వరదను డ్యాం ఎదుర్కొందని, అప్పుడు రాని శబ్దాలు ఇప్పుడు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చిన భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు.

Also Read:

Batukamma:గౌరమ్మను తల్లి గంగమ్మ ఒడిలో వదిలేసే సద్దుల బతుకమ్మ

Women Health: మహిళలూ బీ అలర్ట్.. ఈ 7 లక్షణాలు అస్సలు విస్మరించొద్దు..

Advertisment
Advertisment
తాజా కథనాలు