Kalava Srinivasulu: రాజకీయ కుట్రలను తేటతెల్లము చేసేలా రాజధాని ఫైల్స్: కాలవ శ్రీనివాసులు

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జరుగుతున్న రాజకీయ కుట్రలను తేటతెల్లము చేసేలా రాజధాని ఫైల్స్ చిత్రం ఉందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఈ చిత్రం మంచి ప్రేక్షకు ఆదరణ పొందడంతో పాటు రాజధాని అవసరాన్ని ప్రజలకు గుర్తు చేస్తుందన్నారు.

New Update
AP: రసాభాసగా జిల్లా సర్వసభ్య సమావేశం.!

Kalava Srinivasulu: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జరుగుతున్న రాజకీయ కుట్రలను తేటతెల్లము చేసేలా రాజధాని ఫైల్స్ చిత్రం ఉందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. అనంతపురంలోని గౌరీ కాంప్లెక్స్ గౌతమి థియేటర్లో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ శ్రేణులతో కలిసి రాజధాని ఫైల్స్ చిత్రాన్ని వీక్షించారు.

Also Read: వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు.. మీ చేతకాని తనానికి ఇలా అడుగుతున్నారా? అంటూ ఫైర్

అనేక కోణాల్లో రాజధానిపై జరుగుతున్న కుట్రలను, రైతుల త్యాగాలను, ప్రజలు ప్రజా రాజధానిని ఎంత బలంగా కోరుకుంటున్నారన్న విషయాన్ని చిత్రంలో స్పష్టంగా చూపించారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని విషయంలో జరుగుతున్న వాస్తవాలు చెప్పటంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా ఉన్నది ఉన్నట్లు చిత్రంలో చూపించారని తెలిపారు.  ఈ చిత్రం మంచి ప్రేక్షకు ఆదరణ పొందడంతోపాటు రాజధాని అవసరాన్ని ప్రజలకు గుర్తు చేస్తుందన్నారు.

Also Read: మళ్లీ విచారణకు డుమ్మా కొట్టిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు

కాగా, అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరకెక్కిన రాజధాని ఫైల్స్ చిత్రంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి వరకు సినిమా విడుదలపై స్టే విధించాలని ఆదేశాలు జారీ చేసింది. సినిమాకు చెందిన అన్ని రికార్డులను తమకు అందించాలని కోరింది. ఈ సినిమాలో వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు