AP: అందుకే ఇలా పిచ్చి రాతలు రాస్తున్నారు: మాజీ మంత్రి కాకాణి రాజకీయంగా ఎదుర్కోలేక తనపై పిచ్చి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి. ధర్మల్ ప్రాజెక్టు నుంచి ఫ్లయాష్ ఇతర రాష్ట్రాలకు సోమిరెడ్డి అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. సోమిరెడ్డి అక్రమాలపై ఆధారాలతో సహా అన్ని ఇస్తాను..చంద్రబాబు విచారణ చేపట్టగలరా? అని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 06 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Kakani Govardhan Reddy: రాజకీయంగా తనను ఎదుర్కోలేక పిచ్చి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ లేఔట్లు వేసిన పరిస్థితి తమ హయాంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఇష్టప్రకారంగా అక్రమ లే ఔట్స్ వేశారని ఆరోపించారు. Also Read: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్.. అక్రమనిర్మాణాలపై కొరడా..! 2019లో తాము అధికారంలోకి రాగానే వాటిపై జిల్లా కలెక్టర్ విచారణ చేశారని..పొదలకూరు పరిధిలో 40 అక్రమ లేఔట్లు వేశారని అప్పట్లో తేల్చారన్నారు. 2016 టీడీపీ హయాంలో విజిలెన్స్ విచారణ జరిపితే 25 లేఔట్లకి 6 కోట్లకి పైగా ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెప్పరన్నారు. రూ. 6 కోట్లు ఫైన్ వేస్తే.. 2 కోట్లు సోమిరెడ్డి కమిషన్లు తీసుకుని విజిలెన్స్ నివేధికని తొక్కి పెట్టాడని ఆరోపించారు. సోమిరెడ్డి ఇంటి చుట్టూ ఉన్న లే ఔట్లలో కమిషన్లు తీసుకున్నాడన్నారు. అధికార దాహానికి పంచాయతీ కార్యదర్శులపై చర్యలకు నివేదిక ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: చంద్రబాబు ముందు సీఎం రేవంత్ పెట్టె డిమాండ్స్.. ఇవే! ధర్మల్ ప్రాజెక్టు నుంచి సోమిరెడ్డి, ఆయన కొడుకు నెల మామూళ్లు తీసుకుంటున్నారని.. చిత్తశుద్ధి ఉంటే అల్లిపురంలో లే ఔట్లపై విచారణ చేపించగలరా? సోమిరెడ్డి అక్రమాలపై చంద్రబాబు నిఘా పెట్టి విచారణ చేపించగలరా..? ఆధారాలతో సహా అన్ని ఇస్తాను.. సోమిరెడ్డి అక్రమాలపై చంద్రబాబు విచారణ చేపట్టగలరా? అని ప్రశ్నించారు. 'సిట్ వేస్తానని సోమిరెడ్డి చెబుతున్నాడట.. నీకు ఇష్టమైన విభాగం నుంచి విచారణ చేపించుకో సోమిరెడ్డి' అంటూ ఉద్ఘాటించారు. ధర్మల్ ప్రాజెక్టు నుంచి ఫ్లయాష్ ఇతర రాష్ట్రాలకు సోమిరెడ్డి అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. #kakani-govardhan-reddy #tdp-leader-somireddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి