KA Paul: బర్రెలక్కకు జై కొట్టిన కేఏ పాల్!.. ఆ మూడు పార్టీలకూ ఓటేయొద్దని పిలుపు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బర్రెలక్కకు జై కొట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఆమెకు మద్దతు తెలపగా, తాజాగా కేఏ పాల్ ఆ జాబితాలో చేరారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటు వేయొద్దని వేములవాడలో ఆయన ప్రజలను కోరారు. By Naren Kumar 24 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KA Paul Supports Barrelakka: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని తన వైపునకు తిప్పుకున్న కొల్లాపూర్ బర్రెలక్కకు విస్తృత మద్దతు లభిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు అక్కడికి వెళ్లి బర్రెలక్కకు అండగా నిలవగా, అనేక మంది స్వచ్ఛందంగా కొల్హాపూర్ లో బర్రెలక్క తరఫున ప్రచారం చేస్తున్నారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బర్రెలక్కకు మద్దతు పలికారు. కొల్లాపూర్ లో తమ పూర్తి మద్దతు బర్రెలక్క అలియాస్ శిరీషకే ఉంటుందని స్పష్టం చేశారు. వేములవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేఏ పాల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘ఓటు వేయకుండా ఇంట్లోనైనా కూర్చోండి గానీ; బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకైతే ఓటు వేయొద్దు’’ అని ప్రజలను కోరారు. కొల్లాపూర్ ఓటర్లు బర్రెలక్కను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి: బర్రెలక్కకు జాబ్.. దాడి చేసింది వాళ్లే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన ఇప్పటికీ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆమెకు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సర్పంచ్ నవ్య కూడా బర్రెలక్కనే గెలిపించాలని కోరారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, యువత ఆమెకు మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె తనదైన రీతిలో ప్రచారం కొనసాగిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు భద్రత కల్పించాలని హైకోర్టు కూడా ఆదేశించిన విషయం తెలిసిందే. #ka-paul #telangana-elections-2023 #barrelakka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి