KA Paul: 'నన్ను చంపాలని చూస్తున్నారు'..కేఏ పాల్ సంచలన ఆడియో..! నన్ను చంపాలని చూస్తున్నారంటూ కేఏ పాల్ మాట్లాడినట్లు ఉన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. డిసెంబర్ 25న ఫుడ్ పాయిజన్‌తో తనను చంపాలని చూశారని.. దీంతో ఎవరికీ చెప్పకుండా తాను విశాఖలో చికిత్స పొందుతున్నట్లు కేఏ పాల్ అన్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. By Jyoshna Sappogula 05 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి KA Paul: ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నన్ను చంపాలని చూస్తున్నారంటూ కేఏ పాల్ మాట్లాడినట్లుగా ఆడియో ఉంది. తనపై హత్యాయత్నం జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకల సమయంలో తనను చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తనకు ఫుడ్ పాయిజన్ (Food Poison) అయ్యేలా చేశారని అన్నారు. Also Read: వారికి టికెట్ వద్దు.. జగన్ కు మాజీ సీఎం కేసీఆర్ సలహాలు! రాజకీయ కుట్రే: కే ఏ పాల్ విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. ఫుడ్ పాయిజనింగ్ తరువాత ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపారు. దేవుడి దయ వల్ల తాను ప్రాణాలతో బతికి బయటపడ్డానని చెప్పుకొచ్చారు. ఈ విషయం చెప్పొచ్చో లేదోనని ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు. పది రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నానని, కాన్ఫిడెన్షియల్ గా చికిత్స తీసుకుంటున్నట్లు ఆ ఆడియోలో ఉంది. రాజకీయ కుట్రలతో తనపై హత్యాయత్నం (Murder Attempt) జరిగిందని కేఏ పాల్ చెప్పినట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతుంది. Also Read: డీఎండీకే అధినేత విజయకాంత్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ హీరో సూర్య.!(వీడియో) పీస్ మేకర్ టూ పొలిటిషన్.. గ్లోబల్ పీస్ మేకర్ గా కేఏ పాల్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఆంధ్రప్రదేశ్ చిట్టివలస గ్రామంలో జన్మించారు. మత ప్రచారకుడిగా తన తండ్రితో కలిసి వెళ్తూ అలా గోస్పల్ ఫౌండేషన్ కు అన్నీ తానై క్రిస్టియానిటీ బోధకుడిగా మారారు. క్రిస్టియనీటి స్వీకరించిన కే పాల్ ఆ తరువాత దేశ విదేశాల అగ్ర నాయకులను కలిసి సేవా కార్యక్రమాలకు నిధులను సమాకుర్చుకునేవాడు. అగ్ర నాయకులతో మాట్లాడి ఎన్నో యుద్దాలను జరగకుండా ఆపేసారంటూ ఆయన గురించి చెబుతారు. ఎన్నో లక్షల కుటుంబాలకు వారి ఫౌండేషన్ ద్వారా చదువు, ఆరోగ్య సేవలు అందిస్తున్న కేఏ పాల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసారు. ప్రజాశాంతి పార్టీ (Prajasanthi Party) పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. #ka-paul #prajasanthi-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి