JP Nadda: హమ్మయ్య..మొత్తానికి జేపీ నడ్డా భార్య కారు దొరికింది..అసలేం జరిగిందంటే!

చోరీకి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు ఎట్టకేలకు దొరికింది. గత నెల 19న ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో లభ్యమైంది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
JP Nadda: హమ్మయ్య..మొత్తానికి జేపీ నడ్డా భార్య కారు దొరికింది..అసలేం జరిగిందంటే!

JP Nadda Car: దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారులు ఎట్టకేలకు దొరికింది. ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో ప్రత్యక్షమైంది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ఫరిదాబాద్ సమీపంలోని బధ్కల్ కు చెందిన షాహిద్, షివంగ్ త్రిపాఠి అనే ఇద్దరు వ్యక్తులు ఆ కారును వారణాసికి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. కారు నెంబర్ ప్లేట్ ను మార్చి అనంతరం అలీగఢ్, లఖింపూర్ ఖేరి, బరేలి, సీతాపూర్, లక్నో మీదుగా వారణాసి తీసుకువచ్చినట్లుగా పోలీసులు తెలిపారు.

కారును నాగాలాండ్ కు తరలించేందుకు నిందితులు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నడ్డా భార్య మల్లికాకు చెందిన ఫార్చునర్ కారును మార్చి 19వ తేదీన నడ్డా డ్రైవర్ సర్వీస్ సెంటర్ లో ఉంచి భోజనం చేసేందుకు బయటకు వెళ్లాడు. నిందితులు ఆ కారును దొంగలించారు. డ్రైవర్ జోగిందర్ సింగ్ గోవింద్ పురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు , సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు.అనంతరం ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ఈ కారును గుర్తించేందుకు స్పెషల్ టీమ్ 15 రోజుల్లో 9 నగరాల్లో సెర్చ్ నిర్వహించింది. కారు చోరీకి గురైందని ఎవరికీ అనుమానం రాకుండా షాహిద్ తన భార్య, పిల్లలతో ఫరీదాబాద్ కు వెళ్లాడు.

ఇది కూడా చదవండి: భార్యను చంపి మృతదేహాన్ని..224ముక్కలుగా నరికి..బ్లాస్టిక్ బ్యాగులో కుక్కి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు