Andhra Pradesh : పాపం.. శ్మశానవాటికకు దారి లేక.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో శ్మశానవాటికకు వెళ్లే దారిలేకపోవడంతో ఎస్సీ కాలనీవాసులు మోకాల్లోతు నీళ్లలో మృతదేహాన్ని తరలించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమకీ దుస్థితి తప్పడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి శ్మశానవాటికకు రోడ్డు వేయాలని కోరుతున్నారు. By Jyoshna Sappogula 11 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి West Godavari : ఏలూరు జిల్లా (Eluru District) జీలుగుమిల్లిలో శ్మశానవాటికకు వెళ్లే దారిలేక ఎస్సీ కాలనీవాసులు నానా అవస్థలు పడుతున్నారు. నేడు ఉదయం ఎస్సీ కాలనీలో ములగిరి రత్తమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. Also Read: రోడ్డు సేఫ్టీ అవగాహన పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి! అయితే, శవాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్మశానవాటికకు వెళ్లే మార్గం లేకపోవడంతో మోకాల్లోతు నీళ్లలో మృతదేహాన్ని తరలించారు. పొలాల మధ్య నుంచి అతి కష్టంమీద మృతదేహాన్ని దాటించారు. తమ కాలనీలో ఎవరైనా చనిపోతే కాలువలు, పొలాలు దాటి బురదలో అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోందంటూ ఎస్సీ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read: ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం! ప్రభుత్వాలు మారుతున్నా తమకీ దుస్థితి తప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి శ్మశానవాటికకు (Cemetery) రోడ్డు వేయాలని కాలనీవాసులు కోరుతోన్నారు. #west-godavari #cemetery మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి