రిక్షావాలా టు మినిస్టర్.. ఎవరీ రత్నేష్ సదా..!

ఒక సామాన్యుడు రాజకీయాల్లో రాణించి.. అంచలంచెలుగా ఎదుగుతూ సీఎం, పీఎం అయిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అలాంటి కోవకే చెందుతారు రత్నేష్ సదా. బిహార్ కు చెందిన ఈ నేత మొదట్లో రిక్షా తొక్కుతూ జీవనం సాగించేవారు. రాజకీయాల వైపు అడుగులు వేసి బిహార్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఇప్పడీ లీడర్ ను మంత్రి పదవి వరించింది.

New Update
రిక్షావాలా టు మినిస్టర్.. ఎవరీ రత్నేష్ సదా..!

jdu mla ratnesh sada takes oath as bihar minister replacing santosh suman

హిందూస్తానీ అవాం మోర్చా పార్టీ అధ్య‌క్షుడు సంతోష్ సుమ‌న్ త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈయన ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి జిత‌న్ రాం మాంజీ కుమారుడే ఈ సంతోష్ సుమ‌న్. ఈయన రాజీనామాతో మంత్రి వర్గ విస్తరణపై సీఎం నితీష్ దృష్టి పెట్టారు. ముఖ్యంగా దళిత నాయకుడ్ని మంత్రి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే సదాతో పాటు కాంగ్రెస్, ఆర్జేడీలకు చెందిన మరికొందరు నేతలను కూడా మంత్రులుగా ఎంపిక చేశారు. వీరంతా ప్రమాణ స్వీకారం చేశారు.

రత్నేష్ సదా తొలినాళ్లలో..

రత్నేష్ సదా తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించారు. రాజకీయాల్లోకి రాకముందు రిక్షా తొక్కి జీవనం సాగించేవారు. ఈయన మహిషి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమర్ గ్రామ నివాసి. ఈయన ఫ్యామిలీ సోన్‌ బర్సాలోని కహ్రా కుటీలో నివసిస్తోంది. తండ్రి కార్మికునిగా పనిచేసేవాడు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రత్నేష్ సదా గ్రాడ్యుయేట్. ఈయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయాల్లో అడుగులు

రత్నేష్ సదా రాజకీయ జీవితం 1987లో ప్రారంభమైంది. అంచలంచెలుగా ఎదుగుతూ 2010లో జేడీయూ తరఫున సోన్‌ బర్సా రిజర్వ్‌ డ్ స్థానం నుండి ఎమ్మెల్యే అయ్యారు. వరుసగా మూడుసార్లు గెలిచారు. ఈయన జేడీయూ మహాదళిత్ సెల్ అధ్యక్షుడు కూడా. జేడీయూ ఉపాధ్యక్ష పదవితోపాటు పార్టీలో ఇతర కీలక పదవులు కూడా నిర్వహించారు. ప్రస్తుతం జేడీయూ విప్‌ గా ఉన్న ఈయన బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ కు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. సదా చర, స్థిరాస్తుల విలువ 1.30 కోట్లు. ఈయనపై ఎటువంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదు.

నితీశ్ ప్లాన్ ఇదే!

మంచి ఫాలోయింగ్ ఉన్న రత్నేష్ సదాను బాగా హైలైట్ చేయడానికి నితీశ్ ఉత్సాహంగా ఉన్నారు. దీనికి కారణం.. సంతోష్ సుమ‌న్ రాజీనామాతో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడమే. 2022లో మహాఘట్‌ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేడీయూ బీజేపీతో బంధాన్ని తెంచుకుంది. సుమన్ రాజీనామా తర్వాత బిహార్ కేబినెట్‌ లో 30 మంది మంత్రులు అయ్యారు. అసెంబ్లీ మొత్తం బలం ఆధారంగా, గరిష్టంగా 36 మంది మంత్రులు ఉండవచ్చు. 243 సీట్ల బిహార్ అసెంబ్లీలో మహాఘట్‌ బంధన్‌ లో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేబినెట్‌ లో ఆర్జేడీకి 16 మంది, జేడీయూకి 11 మంది, కాంగ్రెస్‌ కు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒక స్వతంత్ర సభ్యుడు కూడా ఉన్నారు. సంతోష్ సుమన్ శాసనమండలి సభ్యుడు కాగా, హెచ్‌ఏఎంకు అసెంబ్లీలో మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: ఎక్కడికీ వెళ్లొద్దు..అమెరికాలో టెకీలకు కంపెనీలు వార్నింగ్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 04, 2025 08:10 IST

    ఎక్కడికీ వెళ్లొద్దు..అమెరికాలో టెకీలకు కంపెనీలు వార్నింగ్

    ట్రంప్ వచ్చిన తర్వాత అంతా తారుమారు అయిపోతున్నాయి. ఇమ్మిగ్రేషన్, వీసా పాలసీలు మారిపోయాయి.  ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం పట్టుకుంది. దీంతో అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలు అన్నీ హెచ్ 1 బీ మీద చేస్తున్న ఉద్యోగులను ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నాయి. 

    H1B Visa
    H1B Visa

     



  • Apr 04, 2025 08:08 IST

    హెల్త్‌ సూపర్‌వైజర్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!

    మహబూబాబాద్ హెల్త్ సూపర్ వైజర్ పార్థసారథి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. భార్య స్వప్నేప్రియుడికి రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. వెంటనే పోలీసులు స్వప్న, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

    Mahabubabad Supervisor Parthasarathy Case Update🔴LIVE : లవర్‌తో 5 లక్షల సుపారీ ఇచ్చి | Wife Swapna



  • Apr 04, 2025 08:08 IST

    ప్రముఖ నటుడు కన్నుమూత

    బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించారు.

    Veteran Actor Manoj Kumar Passes Away At 87
    Veteran Actor Manoj Kumar Passes Away At 87 Photograph: (Veteran Actor Manoj Kumar Passes Away At 87)

     



  • Apr 04, 2025 08:07 IST

    ఆమెకు మనసిచ్చేసిన చాహల్.. ఒక్క లైక్‌తో దొరికేసాడుగా!

    టీమిండియా క్రికెటర్ చాహల్-మహ్‌వశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మహ్‌వశ్ సోషల్ మీడియాలో ‘హస్బెండ్’ పోస్టు పెట్టింది. అందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలిపింది. ఆ వీడియోకు చాహల్ లైక్ కొట్టడంతో వీరిద్దరి రిలేషన్ వార్తలకు మరింత బలం చూకూరినట్లైంది.

    Yuzvendra Chahal - RJ Mahvash
    Yuzvendra Chahal - RJ Mahvash Photograph: (Yuzvendra Chahal - RJ Mahvash)

     



  • Apr 04, 2025 08:07 IST

    ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్

    ఒడిశా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో 12 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో వాష్ రూమ్‌కి వెళ్లడంతో లైంగికంగా వేధించి వీడియో రికార్డింగ్ చేశాడు. వెంటనే తల్లిదండ్రులు 139కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు.



  • Apr 04, 2025 08:06 IST

    హైకోర్ట్ లో ఆర్జీవీకి ఊరట..తొందరపాటు చర్యలు వద్దు

    సినీ దర్శకుడు రాంగోపాల వర్శకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో ఊరట దక్కింది. విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో...విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.

    RGV



  • Apr 04, 2025 08:06 IST

    మరో నెల రోజులపాటు ముంబైలోనే కొడాలి నాని.. టెన్షన్‌లో అభిమానులు!

    కొడాలి నానికి ఇటీవలే బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యావేక్షణలో ఉన్నారని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు తెలిపారు. నాని మరో నెల రోజులపాటు ముంబైలోనే ఉంటారని అన్నారు.

    kodali nani..
    kodali nani..

     



  • Apr 04, 2025 08:05 IST

    వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం

    రెండు రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతున్న వక్ఫ్  సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపేసింది. రాజ్యసభలో కూడా అర్ధరాత్రి వరకూ దీనిపై చర్చ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటేశారు. 

    Rajya Sabha: రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో ఎన్డీయే ఏకగ్రీవం



  • Apr 04, 2025 08:04 IST

    ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

    ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

    Rains



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు