విజయశాంతికి చెక్ పెట్టడానికేనా బీజేపీలోకి జయసుధ.. ఆమెకు అధిష్టానం ఇచ్చిన హామీలివేనా!!

జయసుధ బీజేపీలో చేరడంతో పార్టీకి ఏ మేరకు లాభం చేకూరనుంది..అధిష్థానం భావిస్తున్నట్టుగా ఆమె విజయ్ శాంతికి గట్టి పోటీ ఇస్తారా.. అవసరమైతే చెక్ పెట్టేంత సత్తా జయసుధకు ఉందా.. ఇప్పటికే ఎన్నో పార్టీలు మారిన ఆమెకు బీజేపీ అధిష్టానం ఇచ్చిన హామీలేంటీ..??

New Update
విజయశాంతికి చెక్ పెట్టడానికేనా బీజేపీలోకి జయసుధ..   ఆమెకు అధిష్టానం ఇచ్చిన హామీలివేనా!!

సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలోకి చేరారు. ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు జాతీయ నేతల సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో  టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇంకా డాక్టర్ లక్ష్మణ్ తో పాటు పలువురు ఎంపీలు.. పార్టీ ప్రధాన కార్యదర్శులు, సునీల్ బన్సల్ పాల్గొననున్నారు. అయితే జయసుధ బీజేపీలో చేరడంతో పార్టీకి ఏ మేరకు లాభం చేకూరనుంది..అధిష్థానం భావిస్తున్నట్టుగా ఆమె విజయ్ శాంతికి గట్టి పోటీ ఇస్తారా.. అవసరమైతే చెక్ పెట్టేంత సత్తా జయసుధకు ఉందా.. ఇప్పటికే ఎన్నో పార్టీలు మారిన ఆమెకు బీజేపీ అధిష్టానం ఇచ్చిన హామీలేంటీ..??

ముందుగా ఆమె రాజకీయప్రస్తానం పై లుక్కేస్తే.. ఆమెను వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ నుంచి ఆమెను బరిలోకి దింపారు. అలా స్టార్ట్ అయిన ఆమె పొలిటికల్ ప్రస్తానం లో.. ఆమె మొదటి సారి సికింద్రాబాద్ నుంచి గెలుపును సొంతం చేసుకొని..2009లో ఎమ్మెల్యే అయ్యారు. అయితే రాష్ట్ర విభజన తరువాత అందరూ ఆమె వైసీపీలో చేరుతారని భావిస్తే ఆమె మాత్రం జగన్ కు హ్యాండ్ ఇస్తూ.. 2016లో టీడీపీలో చేరారు.

కాని అప్పట్నుంచి ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక తరువాత చంద్రబాబు షాక్ ఇస్తూ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు.  2019 లో జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరారు. ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని, అదే విధంగా వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆమె క్రియాశీలక రాజకీయాల్లో చాలా కాలం నుంచి లేరు. ఇక గతేడాది నుంచి మాత్రం ఆమె బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. విజయశాంతికి గట్టి పోటీగా పార్టీలోకి జయసుధ ఎంట్రీ ఖాయమని.. ఈ నేపథ్యంలో ఆగష్టు 21, 2022 లోనే జయసుధ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కాని వాటిని ఆమె తీవ్రంగా ఖండించారు.ఏ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదన్నారు.

అయితే ఆమె బీజేపీలో చేరడానికి కొన్ని డిమాండ్లను పార్టీ జాతీయ నాయకత్వం ముందు ఉంచారని, తమ డిమాండ్లు నెరవేరితేనే చేరుతానని ఖరాఖండిగా చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీ పార్టీలోకి చేరడం చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా ఏడాదిగా ఆమె డిమాండ్లు అధిష్టానం ముందు ఉండగా.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆమె పార్టీలో చేరారంటే.. తప్పకుండా పార్టీ ఆమె హామీలను నెరవేర్చి ఉంటుందని చర్చించుకుంటున్నారు.

ఇక విజయశాంతికి ఆమె గట్టిపోటీ ఇస్తుందని అదే విధంగా క్యాంపెయినింగ్ లో సినీ గ్లామర్ కింద వర్కౌట్ అవుతుందనే హైకమాండ్ ఆమెను ఆహ్వానించింది. మరి తన పద్నాగేళ్ల రాజకీయ ప్రస్తానంలో అన్నీ పార్టీలు మారిన జయసుధ.. ఈ సారి క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారా.. ఆమె ఇంపాక్ట్ ఏవిధంగా ఉంటుంది..మళ్లీ సికింద్రాబాద్ నుంచే బరిలోకి దిగుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. జయసుధ మాత్రం తనకు సికింద్రాబాద్ కాని ముషీరాబాద్ నుంచి కాని టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ నియోజకవర్గాల నుంచి టికెట్ ఇచ్చినా..ఆమె గెలుపు గుర్రమేనా.. అన్నది చూడాల్సిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు