Jarkhand Politics: జార్ఖండ్‌ పాలిటిక్స్‌ @హోటల్‌ ఎల్లా.. హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు.. వీడని ఉత్కంఠ

జార్ఖండ్‌ రాజకీయాలకు హైదరాబాద్‌కు వేదికైంది. భాగ్యనగరంలోని హోటల్‌ ఎల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇండియా కూటమి ఎమ్మెల్యేల్లో అందుబాటులో ఉన్న 35 మంది కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. మరోవైపు ఉత్కంఠ కొనసాగుతోంది.

New Update
Jarkhand Politics: జార్ఖండ్‌ పాలిటిక్స్‌ @హోటల్‌ ఎల్లా.. హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు.. వీడని ఉత్కంఠ

Jarkhand Politics: అనిశ్చితికి పెట్టింది పేరైన జార్ఖండ్‌ రాజకీయాలు ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. భాగ్యనగరంలోని హోటల్‌ ఎల్లా వేదికగా ఆ రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. సీఎంగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ అరెస్టు నేపథ్యంలో జార్ఖండ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు, ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. అరెస్టుతో అప్రమత్తమైన కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించింది. ప్రత్యేక విమానంలో ఇండియా కూటమికి చెందిన 35 మంది ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడినుంచి గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాకు తరలించి అక్కడ వారికి వసతి కల్పించారు.

ఇది కూడా చదవండి: సీఎం తొలి బహిరంగ సభ అక్కడే.. పార్లమెంటు ఎన్నికలకు రేవంత్‌ శంఖారావం

జార్ఖండ్‌ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవికి హేమంత్ సొరెన్ రాజీనామా చేయగా.. శాసనసభాపక్షనేతగా జేఎంఎం సీనియర్‌ నేత, రవాణా మంత్రి చంపయ్‌ సోరెన్‌ను వారు ప్రకటించారు. ఇది జరిగి గంటలు గడుస్తున్నా గవర్నర్‌ వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా ఆహ్వానించలేదు. దీంతో అలర్ట్‌ అయిన కాంగ్రెస్‌ హై కమాండ్ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది. ఇండియా కూటమి ఎమ్మెల్యేల్లో అందుబాటులో ఉన్న 35 మంది కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలుండగా, ప్రభుత్వం ఏర్పాటు కోసం 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ఇదిలా ఉంటే, చంపయ్‌ సోరెన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని బీజేపీ ఘంటాపథంగా చెప్తోంది. తగినంత మద్ధతు లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేదని వాదిస్తోంది. మరోవైపు, జేఎంఎం మిత్రపక్షం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బీజేపీపై విమర్శలు కురిపించారు. ఓ గిరిజన ముఖ్యమంత్రిని ఈడీని అడ్డుపెట్టుకుని బీజేపీ వేధిస్తోందన్నారు. తమ మద్దతు హేమంత్‌కే అని స్పష్టంచేశారు. ఇదిలా కొనసాగుతుండగా; హేమంత్‌ సోరెన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

భారతదేశం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఓ రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ Xలో షేర్ చేశారు. గతేడాది కంటే ఈ ఎగుమతులు 54 శాతం పెరిగాయని ఆయన అన్నారు.

New Update
Ashwini Vaishnaw

Ashwini VaishnawAshwini Vaishnaw Photograph: (Ashwini Vaishnaw)

భారతదేశం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఓ రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసింది ఇండియా. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని Xలో షేర్ చేశారు. ప్రొడక్షన్ -లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కింద గవర్నమెంట్ ఇది రికార్డు బ్రేక్ చేసిన క్షణమని ఆయన ప్రశంసించారు.
ఒక సంవత్సరంలో ఎగుమతులు 54 శాతం పెరిగాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.  

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 54 శాతం పెరిగాయి. భారత్ మేక్ ఇన్ ఇండియా వైపు పరుగులు పెట్టడంతోపాటు ఉపాది అవకాశాలు సృష్టిస్తోందని ఆయన అన్నారు. భారతీయ MSMEలు ప్రస్తుతం వరల్డ్ సఫ్లై చైన్‌లో కీలకంగా మారుతున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కొనియాడారు. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఆపిల్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం షిప్‌మెంట్‌లలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉంది. తమిళనాడులోని ఫాక్స్‌కాన్ సౌకర్యం ఒక ప్రధాన ఎగుమతి కేంద్రంగా ఉంది. భారతదేశం నుంచి ఐఫోన్ షిప్‌మెంట్‌లలో దాదాపు సగం బాధ్యత తమిళనాడు మానిఫ్యాక్చర్ సెంటర్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment