AP: ఎమ్మెల్సీగా జనసేన నేత నామినేషన్.. ఇనాళ్లు పరోక్షంగా.. ఎమ్మెల్సీగా జనసేన నేత హరిప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన అధినేత పవన్ కళ్యాణ్‌కి రుణపడి ఉంటానన్నారు. పవన్ కళ్యాణ్ ప్రపోజలను అంగీకరించిన చంద్రబాబుకి, లోకేష్‌కి ధన్యవాదాలు తెలిపారు. By Jyoshna Sappogula 02 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి TDP - Janasena MLC Candidates: ఎమ్మెల్యే కోటాలో (MLA Quota) ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు NDA కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య (C. Ramachandraiah), జనసేన నేత పిడుగు హరిప్రసాద్‌ను (Pidugu Hari Prasad) అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్సీగా జనసేన పార్టీ నేత హరిప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడ వరకు వచ్చానన్నారు. Also Read: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా?.. డిప్యూటీ సీఎం పవన్ కు ఎంపీ మిథున్ రెడ్డి సవాల్..! ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) రుణపడి ఉంటానన్నారు. పవన్ కళ్యాణ్ ప్రపోజలను అంగీకరించిన చంద్రబాబుకి, లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. పాత్రికేయుడిగా అనేక సమస్యల మీద పరోక్షంగా పోరాటం చేసినట్లు తెలిపారు. Also Read: బెంగుళూర్‌లో మాజీ సీఎం డిఫరెంట్ లుక్.. తొమ్మిది రోజుల తర్వాత.. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మండలిలో జనసేన తరఫున మొదటిసారి అడుగుపెడుతున్నానని.. ఎమ్మెల్సీగా అవకాశ రావడం సంతోషంగా ఉందని తెలిపారు. మండలిలో అర్థమంతమైన చర్చలు సాగేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. #janasena-hariprasad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి