AP Politics: టీడీపీ టార్గెట్ ఇదే.. అందుకే పొత్తులు పెట్టుకున్నాం : అచ్చెన్నాయుడు

వైసీపీని గద్దె దించాలనే పొత్తులు పెట్టుకున్నామన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్. 150 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబు ఎన్నోసార్లు సర్వేలు చేసి అభ్యర్థులను ప్రకటించారన్నారు. పొత్తును విచ్ఛిన్నం చేయడానికి జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

New Update
AP Politics: టీడీపీ టార్గెట్ ఇదే.. అందుకే పొత్తులు పెట్టుకున్నాం : అచ్చెన్నాయుడు

TDP-JSP: ఏపీలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది టీడీపీ-జనసేన. తాజాగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా  అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే పొత్తులు పెట్టుకున్నామన్నారు. పొత్తులో భాగంగా కొంతమందికి సీట్లు రాలేదని అయితే సీట్లు రాని అభ్యర్థులు కూడా కష్టపడి పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నోసార్లు సర్వే లు చేసి అభ్యర్థులను ఎంపిక చేశారన్నారు. 150 సీట్లు టార్గెట్ గా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. విశాఖను రాజధాని అని చెప్పి డ్రగ్స్ తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు.

Also Read: అందరం కలిసి పని చేద్దాం: ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌!

జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పొత్తును విచ్ఛిన్నం చేయడానికి సీఎం జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పొత్తులో పార్టీలతో కలిసి ఆత్మీయ సమావేశాలు జరుపుకుని కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తు ఏమైపోతుందో అని పొత్తు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. పొత్తును తేలికగా తీసుకోకుండా కలిసి ముందుకెళ్లాలని కోరారు. క్షేత్ర స్థాయి పర్యటనల్లో జనసేన నాయకులను అందరినీ పిలిచి కలుపుకోండన్నారు. ఎక్కడైనా ఇబ్బంది కలిగితే రాష్ట్ర స్థాయిలో చర్చిస్తామని తెలిపారు. వీలైనంత వరకూ కింది స్థాయిలో సమస్యలు పరిష్కరించుకోవాలని కార్యకర్తలకు సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు