JSP-TDP: నిడదవోలులో టీడీపీ వర్సెస్ జనసేన రాజకీయం..! నిడదవోలులో టీడీపీ జనసేన రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టికెట్‌ను జనసేన కందుల దుర్గేష్ కు కేటాయించడం టీడీపీ శ్రేణులకు ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. భారీ ర్యాలీతో నిన్న నిడదవోలులో కందుల ఎంట్రీ ఇవ్వగా ఆయన రాకను టీడీపీ కేడర్ తీవ్రంగా వ్యతిరేకించారు. By Jyoshna Sappogula 13 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Kandula Durgesh Vs TDP Burugupalli Sesha Rao: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో టీడీపీ జనసేన రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పొత్తులో భాగంగా నిడదవోలు టికెట్ ను జనసేన కందుల దుర్గేష్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. జనసేనకు సీటు కేటాయించడంతో నిడదవోలు టీడీపీ ఇంచార్జి బూరుగుపల్లి శేషారావు వర్గం అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నిడదవోలులో కందుల దుర్గేష్ భారీ ర్యాలీతో ఎంట్రీ ఇచ్చారు. అయితే, కందుల రాకను నిడదవోలు టీడీపీ కేడర్ వ్యతిరేకించారు. దుర్గేష్ ర్యాలీకి ఏ మాత్రం సహకరించలేదు. దీంతో సొంత వర్గంతోనే కందుల ర్యాలీ చేశారు. Also Read: ముందు మీది మీరు చూసుకోండి.. విదేశీయులకు ఇచ్చిపడేసిన ఇండియా! అనంతరం టీడీపీ ఇంచార్జి బూరుగుపల్లి శేషారావు ఇంటికెళ్లారు కందుల దుర్గేష్. కానీ, శేషారావు ఇంట్లో లేరని చెప్పడంతో కందుల నిరాశగా వెనుతిరిగారు. నిడదవోలు టికెట్ పై శేషారావు ముందు నుంచి ధీమాగా ఉన్నారు. ఆఖరి నిమిషంలో నిడదవోలు టికెట్ జనసేనకు మార్చడంతో ఆయన సహించలేనట్లుగా తెలుస్తోంది. టికెట్ రాకపోవడంతో శేషారావు అయోమయంలో పడ్డారు. సీటు ప్రకటించిన తరువాత కూడా అధిష్టానం నుంచి పిలుపు రాలేదని అలకబూనారని వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కలిసి పోరాడాల్సింది ఉండగా.. నిడదవోలులో మాత్రం టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉంది. తాజాగా జరుగుతున్న రాజకీయాలపై నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. అధిష్టానం శేషారావు కు నచ్చజెప్పి ముందుకు నడిపిస్తుందా లేదంటే చూసిచూడనట్లుగా ఉంటుందా అనేది తెలియాలి..ఒకవేళ హైకమాండ్ ఏ మాత్రం స్పంధించలేదంటే శేషారావు పార్టీ మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. #kandula-durgesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి