Deepthi Case: దీప్తి హత్య కేసులో వీడిన మిస్టరీ.. చెల్లి చందననే హంతకురాలు

జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం రేపిన దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆమె చెల్లెలు చందననే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. బాయ్‌ఫ్రెండ్‌ ఉమర్‌ను వెళ్లి పెళ్లి చేసుకోవాలని చందన భావించిందని.. దీంతో ఇలా చేసిందని ఎస్పీ భాస్కర్ తెలిపారు.

New Update
Deepthi Case: దీప్తి హత్య కేసులో వీడిన మిస్టరీ.. చెల్లి చందననే హంతకురాలు

జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం రేపిన దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆమె చెల్లెలు చందననే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. బాయ్‌ఫ్రెండ్‌ ఉమర్‌ను వెళ్లి పెళ్లి చేసుకోవాలని చందన భావించిందని.. దీంతో ఇలా చేసిందని ఎస్పీ భాస్కర్ తెలిపారు. దీప్తి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారని. ఇదే సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసిన పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావించిందన్నారు.

ప్లాన్‌లో భాగంగా అక్క దీప్తికి వోడ్కా తాగించిందని తెలిపారు. ఆమె నిద్రపోయాక అర్థరాత్రి ఉమర్‌కు ఇంటికి రమ్మని ఫోన్ చేసిందని చెప్పారు. ఈ సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారం తీస్తుండగా.. దీప్తి చూసి కేకలు వేసింది. దీంతో దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేశారని.. 10 నిమిషాల తర్వాత ఆమె చనిపోయిందని నిర్థారించుకున్నారన్నారు. అనంతరం పారిపోయేటప్పుడు నోటికి ప్లాస్టర్ వేసి సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఎస్పీ వెల్లడించారు.  అనంతరం 70 తులాల బంగారం, రూ. 1.20 లక్షలు నగదుతో పరారయ్యారని తెలిపారు.

publive-image

నాలుగు బృందాలుగా ఏర్పడి దీప్తి కేసును దర్యాప్తు చేశారు పోలీసులు. కీలకంగా భావిస్తున్న సోదరి చందన, స్నేహితుడును పోలీసులు అదుపులోకి తీసుకుని విషయాన్ని లాగేశారు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్‌, చందన వాయిస్‌ మెసేజ్‌, ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఈ కేసుకు బలమైన ఆధారాలు లభించాయి.

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజనీరంగ్ కాలేజీలో చందన 2019లో బీటెక్ చదవడానికి జాయిన్ అయింది. ఆ సమయంలో సీనియర్ అయిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. 2021లో చందన కాలేజీ నుంచి డీటెయిన్ అంది. మతాతంతర వివాహం కావడంతో ససేమిరా అన్నారు తల్లిదండ్రులు, అక్క దీప్తి. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని సమయంలో పెళ్లి విషయమై అక్క దీప్తితో నాలుగురోజుల క్రితం ఇంట్లో చందన గొడవపడింది. ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపేసి వెళ్లిపోయారు.

కోరుట్ల  భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దీప్తి, చందన, సాయి ముగ్గురు సంతానం. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తుంది. చందన బీటెక్‌ పూర్తి చేసి, ఇంటి వద్దే ఉంటోంది. కుమారుడు సాయి బెంగళూరులో ఉంటున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు