అవిశ్వాస తీర్మానంపై ఎన్డీయేకి బాసటగా జగన్ పార్టీ ?

ప్రధాని మోడీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాన విషయంలో ఎన్డీయేకి మద్దతుగా నిలవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వం లోని వైఎస్సార్పీసీ యోచిస్తోంది. ఈ తీర్మానంపై పార్లమెంటులో ఓటింగ్ జరిగినప్పుడు దీనికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ పార్టీలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్రంలో బీజేపీతో జగన్ పార్టీ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఎన్డీయేకు మద్దతు పలుకుతోంది. లోక్ సభలో ఈ పార్టీకి చెందిన 22 మంది, రాజ్యసభలో 9 మంది సభ్యులున్నారు. ఎప్పుడు జటిల పరిస్థితి వచ్చినా ఎన్డీయేని ఈ పార్టీ సులువుగా ఆ గండం నుంచి గట్టెక్కిస్తోంది.

New Update
అవిశ్వాస తీర్మానంపై ఎన్డీయేకి బాసటగా జగన్ పార్టీ ?

అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఇక అవిశ్వాసం ఎందుకు ?

అవిశ్వాస తీర్మానంపై చర్చకు లోక్ సభ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా.. జగన్.. కూడా దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్పీకర్ తీసుకునే నిర్ణయం వరకు వేచి చూద్దామని జగన్ తమ సభ్యులకు సూచించినట్టు తెలుస్తోంది. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఇక అవిశ్వాసం ఎందుకని ఈ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. లోక్ సభలో ముగ్గురు సభ్యులున్న టీడీపీ వైఖరి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పార్టీ కూడా స్పీకర్ నిర్ణయం కోసం వేచి చూస్తోంది. 2018 లో నాడు ఎన్డీఎ ప్రభుత్వంపై ఈ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. అప్పుడు కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పార్టీ నేత కేశినేని శ్రీనివాస్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.తరువాతి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగింది. ఇక లోక్ సభలో 9 మంది సభ్యులున్న బీఆర్ఎస్ కూడా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసునిచ్చింది. తమ పార్టీ తరఫున ఈ తీర్మానాన్ని అందజేసినట్టు నామా నాగేశ్వర రావు ఇదివరకే తెలిపారు. ఈ తీర్మానంపై లోక్ సభలో 12 మంది సభ్యులున్న బిజూ జనతాదళ్.. తన వైఖరిని స్పష్టం చేయకపోగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ .. ఓటింగ్ కి దూరంగా ఉండవచ్చు.

Jagan party as a supporter of NDA on the motion of no confidence?

50 మంది ఎంపీల సంతకాలు

అవిశ్వాస తీర్మానంపై 50 మంది ఎంపీలు సంతకాలు చేశారు. కానీ మొత్తం 543 మంది సభ్యులున్న లోక్ సభలో ఎన్డీయే కూటమినుంచి 330 మందికి పైగా సభ్యులు ఉండగా . . విపక్ష కూటమి 'ఇండియా' కు 140 మంది సభ్యులున్నారు .. మరో 60 మంది ఎంపీలు ఏ కూటమిలోనూ లేరు. ఫలితంగా అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమని భావిస్తున్నారు. ఏమైనా మణిపూర్ హింసపై చర్చ కోసం, సభలో మోడీ ప్రకటన కోసం విపక్షాలు పట్టుబడుతున్నాయి.

ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనందుకే

మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనందుకే తాము అవిశ్వాస తీర్మానానికి నోటీసు నిచ్చామని లోక్ సభలో బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర రావు చెప్పారు. మణిపూర్ అంశంపై మోడీ చేసే ప్రకటనను ఈ దేశం వినాల్సి ఉందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ అంశంపై సభలో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయని ఆయన చెప్పారు. దేశ సమస్యలపైనా, మణిపూర్ అంశంతో సహా కేంద్ర వైఫల్యాలపైనా చర్చ జరపాలని అవిశ్వాస తీర్మానం ఇచ్చాం. అఖిల పక్ష సమావేశం లోనే దేశ సమస్యల మీద చర్చ జరపాలని కేంద్రాన్ని కోరాం.. వాయిదా తీర్మానాల ద్వారా కూడా మణిపూర్ పరిస్థితిపై చర్చ జరపాలని అభ్యర్థించాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం ముందుకు రాకపోవడంతో దీన్ని సమర్పించాం అని ఆయన వివరించారు. దేశ బాగోగుల గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తామని, తమ కూటమి బీఆర్ఎస్ అని, తమ నాయకుడు కేసీఆర్ అని అన్నారు.తమ పార్టీ దేశ ప్రజలకోసం ఉందన్నారు.

ఎంఐఎం మద్దతు

మోడీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వేరుగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వం లోని ఎంఐఎం మద్దతునిచ్చింది. పార్లమెంటులో తగినంతమంది తమ పార్టీ సభ్యులు లేకపోయినా తాము బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకి, కాంగ్రెస్ నేతృత్వం లోని 'ఇండియా' కు సమాన దూరం పాటిస్తున్నామని స్పష్టమైన మెసేజ్ ఇచ్చేందుకే బీఆర్ఎస్ ఈ అవిశ్వాస తీర్మాన నోటీసునిచ్చింది. ఈ తీర్మాన విషయంలో ఎంఐఎం మద్దతు తీసుకోవలసిందిగా కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ నోటీసుపై ఒవైసీ సంతకం చేశారు. ఇక ఢిల్లీ ఆర్డినెన్స్ అంశంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతు నిస్తామని కేసీఆర్ ఇదివరకే హామీనిచ్చారు. పార్లమెంటులో ఈ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు