ఇస్రో దూకుడు..మరో ప్రయోగానికి సర్వం సిద్ధం..! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రెడీ అవుతోంది. రేపు ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ ప్రయోగంలో భాగంగా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-56 అంతరిక్షంలోకి పంపించనున్నారు. మొత్తం ఏడు పగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-56 అంతరిక్షంలోకి మోసుకు పోనుంది. By G Ramu 28 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రెడీ అవుతోంది. రేపు (29.7.23) ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ ప్రయోగంలో భాగంగా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-56 అంతరిక్షంలోకి పంపించనున్నారు. మొత్తం ఏడు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-56 అంతరిక్షంలోకి మోసుకు పోనుంది. ఈ ప్రయోగంలో ప్రైమరీ పేలోడ్ ద్వారా డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇందులో సింథటిక్ అపార్చర్ రాడర్(ఎస్ఏఆర్) ఉంటుంది. ఇది ఒక వస్తువుకు సంబంధించి ద్విమితీయ, త్రిమితీయ చిత్రాలను తీయనుంది. 360 కిలోల ఈ ఉపగ్రహాన్ని సింగపూర్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (డీఎస్టీఏ), ఎస్టీ ఇంజనీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహంతో పాటు వెలాక్స్-ఏఎం, ఆర్కేడ్, స్కూబ్-2,, నూలియన్ , గలాసియా-2,, ఓఆర్‌బీ-12 స్ట్రైడర్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇస్రో లాంఛ్ రిహార్సల్ పూర్తి చేసింది. మరోవైపు గగన్ యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్(ఎస్ఎంపీఎస్)కు సంబంధించిన రెండవ, మూడవ టెస్టులను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో అధికారులు పేర్కొన్నారు. ఇస్రో సాధించిన మైలు రాళ్లు ఇవే....! 2013 నవంబర్ న మంగళ్ యాన్ ప్రయోగాన్ని ఇస్రో ప్రారంభించింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ను అంతరిక్షంలోకి ప్రయోగించారు. 2014 సెప్టెంబర్ 24న దీన్ని అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. రూ. 450 కోట్లతో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. మార్చ్ చుట్టూ ఈ మామ్ పరిభ్రమించి అక్కడి ఉష్ణోగ్రత, మార్స్ పై ఉండే ఖనిజాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. చంద్రునిపై భారత్ చేపట్టిన మొదటి మిషన్ చంద్రయాన్-1. దీన్ని అక్టోబర్ 22, 2008న శ్రీహరికోటలోని పతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ప్రయోగించారు. చంద్రునిపై ఉత్తర ధృవంలో ఆవిరి రూపంలో వున్న నీటి ఆనవాలును ఈ మిషన్ గుర్తించింది. దీంతో పాటు చంద్రునిపై వున్న మెగ్నీషియం, సిలికాన్, అల్యూమినియం లాంటి ఖనిజాలను గుర్తించింది. ఆ తర్వాత ఇస్రో చేసిన చెప్పుకో దగిన ప్రయోగాల్లో ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్). దీన్ని 2016లో ఇస్రో చేపట్టింది. ఇది భారత్ కు సొంత నావిగేషన్ సిస్టమ్ ను క్రియేట్ చేసింది. ఇక 2016లో ఒకే మిషన్ లో 20 శాటిలైట్లను ప్రయోగించి ప్రపంచం అంతరిక్ష చరిత్రలో రికార్డు సృష్టించింది. ఇక ప్రతిష్టాత్మక చంద్రయాన్-3ని ఇటీవల శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పుడు అంతరిక్షంలో వడివడిగా పరుగులు తీస్తోంది. తాజాగా ఎత్తును పెంచి, భూమికి ఇంకా దూరంగా చంద్రయాన్-3ని తీసుకు వెళ్లేందుకు ఐదవ సారి కక్ష్యను పెంచే ప్రక్రియన విజయవంతంగా పూర్తయింది. దీని ద్వారా భారతదేశ ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ఇంకా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి