/rtv/media/media_files/2025/12/07/canada-earthquake-2025-12-07-08-15-19.jpg)
Canada Earthquake
Canada Earthquake: కెనడాలోని యూకాన్ ప్రాంతం, అమెరికాలోని అలాస్కా సరిహద్దు మధ్య శనివారం ఒక భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం అక్కడి ప్రజలను ఒక్కసారిగా భయపెట్టింది. పెద్ద ఎత్తున నష్టం లేదా గాయాల గురించి ఎలాంటి సమాచారం రాలేదని అధికారులు తెలిపారు. అలాగే సునామీ హెచ్చరిక కూడా జారీ చేయలేదు.
Whoa, Alaska! A shallow 5.0 magnitude shaker just struck north of Yakutat. Its proximity to the surface means the remote shaking could have felt much stronger at the epicenter!#earthquake#Alaska#quake#AlaskaLifepic.twitter.com/BCA3fTYIrc
— GeoKit | Geology & Earth Alerts (@geokit_app) December 6, 2025
అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం...
అలాస్కా రాజధాని జూనోకు 230 మైళ్లు దూరంలో యూకాన్‌లోని వైట్‌హార్స్‌కు 155 మైళ్లు దూరంలో భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రానికి దగ్గరలో ఉండే కెనడా పట్టణం హైన్స్ జంక్షన్ (జనాభా సుమారు 1,018). అలాగే యాకుటాట్, అలాస్కా (జనాభా 662) కూడా దగ్గరలోనే ఉన్నాయి.
వైట్‌హార్స్‌లో రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీస్ పేర్కొన్న ప్రకారం, భూకంపం కారణంగా ప్రజలు పలువురు 911కి కాల్ చేశారు. నేచురల్ రిసోర్సెస్ కెనడాకు చెందిన భూకంప నిపుణురాలు అలిసన్ బర్డ్ చెప్పిన వివరాల ప్రకారం, ఎక్కువగా దూరపు పర్వత ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉంది. జనాభా తక్కువగా ఉండటంతో పెద్ద నష్టం జరగ లేదని పేర్కొన్నారు. కొన్ని ఇళ్లలో వస్తువులు కింద పడినప్పటికీ, నిర్మాణ నష్టం లాంటి పెద్ద సమస్యలు లేవని ఆమె తెలిపారు.
ఈ భారీ భూకంపం తర్వాత అదే ప్రాంతంలో 20కి పైగా చిన్న చిన్న ఆఫ్టర్‌షాక్‌లు నమోదయ్యాయి. వాటిలో ఒకటి 5.3 తీవ్రతతో మరోటి 5.0 తీవ్రతతో నమోదు అయ్యాయి. అలాస్కా ఎర్త్‌క్వేక్ సెంటర్ ప్రకారం, ఈ ఆఫ్టర్‌షాక్‌లు ముఖ్యంగా అలాస్కా-కెనడా సరిహద్దు ప్రాంతాన్ని ప్రభావితం చేశాయి.
ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం, ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన నివేదికలు లేవు. ప్రాంతం ఎక్కువగా అడవి, పర్వత ప్రాంతం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ఆఫ్టర్‌షాక్‌లు ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Follow Us